ETV Bharat / bharat

దేశంలో మరో 2,828 కరోనా కేసులు.. భారీగా తగ్గిన మరణాలు - కరోనా వైరస్​

India Corona cases: దేశంలో కొత్తగా 2,828 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. మరణాల సంఖ్య భారీగా తగ్గటం ఊరట కలిగిస్తోంది. ఒక్కరోజే 2,035మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

India Corona cases
దేశంలో కరోనా కేసులు
author img

By

Published : May 29, 2022, 9:22 AM IST

India Corona cases: దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కొత్తగా 2,828కేసులు వెలుగుచూశాయి. వైరస్ కారణంగా మరో 14 మంది ప్రాణాలు విడిచారు. మరో 2035 మంది కోలుకున్నారు.

  • మొత్తం కరోనా కేసులు: 4,31,53,043
  • మొత్తం మరణాలు: 5,24,586
  • యాక్టివ్​ కేసులు: 17,087
  • కోలుకున్నవారి సంఖ్య: 4,26,11,370

Vaccination India: దేశవ్యాప్తంగా శనివారం 13,81,764మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,93,28,44,077కు చేరింది. ఒక్కరోజే 4,74,309 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 439,818 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 713 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 531,379,033కుచేరింది. మరణాల సంఖ్య 6,310,376కు చేరింది. ఒక్కరోజే 423,932 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 502,003,755గా ఉంది.

  • బ్రెజిల్​లో కొత్తగా 55,261 కేసులు బయటపడ్డాయి. వైరస్​ ధాటికి 70 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఆస్ట్రేలియాలో తాజాగా 32,810 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో 58 మంది మృతిచెందారు.
  • జర్మనీలో కొత్త కేసులు భారీగా పెరిగాయి. ఒక్కరోజే 26,097 కేసులు వెలుగుచూశాయి.
  • ఫ్రాన్స్​లో తాజాగా 23,582 కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. తైవాన్​లో శనివారం ఒక్కరోజే 80వేలకుపైగా కొత్త కేసులు వెలుగు చూశాయి.

ఉత్తర కొరియాలో: ఉత్తరకొరియాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 89,500 కేసులు వెలుగు చూశాయి. ఒక్కరు కూడా చనిపోలేదు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 34,48,880కి చేరింది. మరణాల సంఖ్య 69గానే ఉంది. వైరస్ బారినపడిన వారిలో 32,62,870 మంది కోలుకున్నారు.

ఇదీ చూడండి: ఆ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ల కలకలం.. బూస్టర్​ డోసు తీసుకున్నా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.