Corona cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య పదివేల దిగువకు చేరింది. కొత్తగా 8,013 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ నుంచి మరో 16,765 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా 119మంది మరణించారు. పాజిటివిటీ రేటు 1.11శాతంగా ఉంది.
- మొత్తం మరణాలు: 5,13,843
- యాక్టివ్ కేసులు: 1,02,601
- కోలుకున్నవారు: 4,23,07,686
వ్యాక్సినేషన్:
Vaccination in india:
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఆదివారం మరో 4,90,321 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,77,50,86,335కు చేరింది.
World Corona cases:
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 11,01,090 కేసులు బయటపడ్డాయి. మొత్తం కేసులు 43,57,91,356కి.. మరణాలు 59,67,748కి చేరుకున్నాయి. రష్యా, జర్మనీ, బ్రెజిల్ దేశాల్లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
- జర్మనీలో కొత్తగా 95,241 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 45 మంది కరోనాకు బలయ్యారు.
- అమెరికాలో కొత్తగా 7,464 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా మరో 189 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో తాజాగా 1,16,093 కరోనా కేసులు నమోదయ్యాయి. 769 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో కొత్తగా 206 మంది చనిపోయారు. 24,054 కేసులు వెలుగుచూశాయి.
- ఫ్రాన్స్‌లో కరోనా మహమ్మారి ధాటికి మరో 76 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 42,600 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
ఇదీ చదవండి: భారత్‌లో కొవిడ్ నాలుగోవేవ్.. ఎప్పుడంటే?