Modi Inaugurated IECC In Delhi : బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వస్తే.. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. వృద్ధిరేటు సైతం మరింత పెరుగుతుందన్నారు. రానున్న 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తయారుచేయడమే తమ లక్ష్యమని మోదీ వెల్లడించారు. భారత్ ప్రజాస్వామ్యానికి మాతృక అనే విషయాన్ని ప్రపంచం అంగీకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. బుధవారం దిల్లీలో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ (IECC) కాంప్లెక్స్‌ను ప్రారంభించిన మోదీ అనంతరం మాట్లాడారు. ఐఈసీసీకి 'భారత్ మండపం' అని నామకరణం చేశారు.
భారత్ కచ్చితంగా పేదరికాన్ని రూపుమాపగలదని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. 13.5 కోట్ల భారతీయులు పేదరికం నుంచి బయటపడినట్లు.. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక ఆయన ప్రస్తావించారు. తమ తొమ్మిదేళ్ల హయాంలో విమానాశ్రయాల సంఖ్య, రైల్వే లైన్ విద్యుదీకరణ భారీగా పెరిగిందన్నారు. 2014లో బీజేపీ అధికారం చేపట్టినప్పుడు ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉండేదన్న ప్రధాని.. ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు.
-
#WATCH | After seeing 'Bharat Mandapam' every Indian is happy, full of pride, says PM Narendra Modi at the inauguration of IECC Complex in Pragati Maidan, Delhi pic.twitter.com/9HRc3EEOHd
— ANI (@ANI) July 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | After seeing 'Bharat Mandapam' every Indian is happy, full of pride, says PM Narendra Modi at the inauguration of IECC Complex in Pragati Maidan, Delhi pic.twitter.com/9HRc3EEOHd
— ANI (@ANI) July 26, 2023#WATCH | After seeing 'Bharat Mandapam' every Indian is happy, full of pride, says PM Narendra Modi at the inauguration of IECC Complex in Pragati Maidan, Delhi pic.twitter.com/9HRc3EEOHd
— ANI (@ANI) July 26, 2023
2014లో 70 ఎయిర్‌పోర్టులు ఉండగా.. 2023 నాటికి దాదాపు 150కి పెరిగినట్లు మోదీ తెలిపారు. 70 ఏళ్లలో 20వేల కిలోమీటర్ల రైల్వే లైన్లను విద్యుదీకరిస్తే.. 9 ఏళ్లలో 40వేల కిలోమీటర్లు విద్యుదీకరించామని వెల్లడించారు. మౌలిక సదుపాయల కోసం దాదాపు రూ.34 లక్షల కోట్లను 9 ఏళ్లలో ఖర్చు చేసినట్లు మోదీ వివరించారు. విమానంలో ప్రయాణించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. సెప్టెంబర్‌లో భారత్ అధ్యక్షతన జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుకు 'భారత్ మండపం' వేదిక అవుతుందన్నారు. అప్పుడు భారత్ స్థాయిని ప్రపంచమంతా చూస్తుందన్నారు. కొంత మంది ప్రతికూల ఆలోచనలతో అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మోదీ మండిపడ్డారు.
భారత్ మండపాన్ని చూసి ప్రతి భారతీయుడు గర్వపడతాడని, ఆనందాన్ని వ్యక్తం చేస్తారని మోదీ వ్యాఖ్యానించారు. ఇది భారత ప్రజాస్వామ్యానికి అందమైన బహుమతి అని ఆయన అభిప్రాయపడ్డారు. పీఎం గతిశక్తి జాతీయ ప్రణాళిక.. భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా ఉండబోతుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం దిల్లీలో నిర్మాణం అవుతుందని మోదీ తెలిపారు.