ప్రముఖ చెట్టినాడ్ కంపెనీపై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ సోదాలు నిర్వహించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో భారీగా పన్ను ఎగవేసినట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న వేళ.. ఈ దాడులు చేపట్టినట్టు తెలుస్తోంది. చెన్నై, హైదరాబాద్, ముంబయి సహా.. మొత్తం పదికిపైగా నగరాల్లోని ఆ సంస్థ కార్యాలయాలపై బుధవారం తనిఖీలు నిర్వహించారు అధికారులు. ముఖ్యంగా చెట్టినాడ్ ప్రైవేట్ లిమిటెడ్, కోయంబత్తూర్ కార్యాలయంలో ప్రత్యేక సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మొత్తం 200 మందికిపైగా అధికారులు ఉన్నట్టు సమాచారం.
చెట్టినాడ్ కంపెనీ చీఫ్ ఎంఏఎం రామసామి చెట్టియార్ మరణాంతరం.. 2015 నుంచి ఆ బాధ్యతలను ఆయన దత్త పుత్రుడు అయ్యప్పన్ చూసుకుంటున్నారు. ఈ కంపెనీపై పలు ఫిర్యాదులతో అదే ఏడాది దాడులు నిర్వహించి ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకుంది ఐటీ శాఖ.
చెట్టినాడ్ గ్రూప్.. సిమెంట్, విద్యుత్, బొగ్గు, స్టెల్ ఫాబ్రికేషన్, రవాణా వంటి పలు వ్యాపారాలను నిర్వహిస్తోంది.
ఇదీ చదవండి: 70లక్షల భారతీయ కార్డు యూజర్ల డేటా లీక్