వానలు ముసురుతున్న వేళ.. బంగాల్ను విషజ్వరాలు(Viral Fever) కలవరపెడుతున్నాయి. గత రెండురోజుల్లోనే జల్పాయిగుడీ జిల్లాలో 130 మంది పిల్లలు జ్వరం(Viral Fever), విరేచనాలతో ఆసుపత్రిలో చేరారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని మెడికల్ కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు.
కరోనా మహమ్మారి మూడోదశ(Corona 3rd Wave) పిల్లలపై అధిక ప్రభావం చూపవచ్చన్న నిపుణుల హెచ్చరికల నడుమ ఈ జ్వరాలు ప్రబలడంతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది.
'ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది' అని ఆరోగ్యశాఖ అధికారి పేర్కొన్నారు. అవసరమైతే పిల్లలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: