కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు విపక్ష నేతలతో.. కాంగ్రెస్ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఈనెల 20న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వర్చువల్‌గా నిర్వహించనున్న భేటీకి హజరయ్యేందుకు విపక్ష నేతలు సిద్ధమయ్యారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈ సమావేశానికి హజరుకానున్నారని ఆయా పార్టీ వర్గాలు వెల్లడించాయి. బంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా సోనియా నిర్వహించే వర్చువల్ భేటీకి హజరవుతారని తృణమూల్ వర్గాలు స్పష్టం చేశాయి. కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందితే.. సమావేశానికి హాజరయ్యేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సిద్ధంగా ఉన్నట్లు డీఎంకే వర్గాలు పేర్కొన్నాయి.
ఇదీ చూడండి: రాహుల్కు మరో షాక్.. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఖాతాపై!
ఇదీ చూడండి: గాంధీలు లేకుండా విపక్ష నేతలకు సిబల్ విందు- దేనికి సంకేతం?