ETV Bharat / bharat

స్కూటీపై డౌట్.. ఓపెన్​ చేస్తే 'గోల్డ్​ బిస్కెట్స్'​​.. విలువ రూ.10 కోట్లు! - గోల్డ్​ బిస్కెట్స్​ స్మగ్లింగ్​ న్యూస్

స్కూటీ ద్వారా బంగారం అక్రమ రవాణాకు యత్నించిన నిందితులను పట్టుకున్నారు మణిపుర్​ కస్టమ్స్​ అధికారులు. వారి నుంచి 50 గోల్డ్​ బిస్కెట్స్​ను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు విమానాశ్రయంలో స్మగ్లింగ్​కు పాల్పడ్డ మరో వ్యక్తిని కూడా అరెస్ట్​ చేశారు. దాదాపు 11 కిలోల బంగారాన్ని అక్రమ రవాణా చేసేందుకు యత్నించాడని అధికారులు వెల్లడించారు.

gold
గోల్డ్​ బిస్కెట్లు
author img

By

Published : Apr 26, 2022, 3:52 PM IST

Gold Smuggling News: ఒక్కరోజే దాదాపు 19 కేజీల బంగారం అక్రమ రవాణాను అడ్డుకున్నారు మణిపుర్​ అధికారులు. సోమవారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో అధికారులు బిస్కెట్ల రూపంలో తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్​పోర్ట్​లో కొన్నిటిని స్వాధీనం చేసుకోగా.. స్కూటీలో మరికొన్నింటిని గుర్తించారు అధికారులు. వీటి విలువ మొత్తం దాదాపు రూ.10 కోట్లు ఉంటుంది.

్
ఎయిర్​ఫిల్టర్స్​లో గోల్డ్​ బిస్కెట్లు
d
అధికారులు స్వాధీనం చేసుకున్న గోల్డ్​ బిస్కెట్లు
్
స్కూటీని పరిశీలిస్తున్న అధికారులు

Imphal Gold Seized: చన్​డేల్​ జిల్లా తమ్నాపోప్కీలో సోమవారం మధ్యాహ్నం ఓ స్కూటీ ద్వారా బంగారం స్మగ్లింగ్​ జరుగుతుండగా అధికారులు గుర్తించారు. ​ బిస్కెట్ల రూపంలో తరలిస్తున్న ఈ బంగారం 8.3 కేజీలు ఉంటుందని.. వీటి విలువ రూ.4.44 కోట్లు అని ఇంఫాల్​ కస్టమ్స్​ యాంటీ స్మగ్లింగ్​ యూనిట్​ అధికారులు వెల్లడించారు. తమకు అందిన సమాచారం మేరకు మోరేహ్​ నుంచి వచ్చే రెడ్​ స్కూటీలో తనిఖీలు చేపట్టగా 50 బంగారం బిస్కెట్లు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. స్కూటీలోని ఎయిర్​ఫిల్టర్లలో ఈ గోల్డ్​ బిస్కెట్లను దాచి నిందితులు స్మగ్లింగ్​కు యత్నించారని తెలిపారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

d
సోమవారం ఉదయం విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న గోల్డ్​ బిస్కెట్లు

అంతకుముందు.. బిస్కెట్ల రూపంలో దాదాపు 11 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని ఇంఫాల్ కస్టమ్స్ విభాగం అధికారులు పట్టుకున్నారు. నిందితుడు ఎయిర్ ఏసియా విమానంలో ఇంఫాల్​ నుంచి దిల్లీ వెళ్లే క్రమంలో తనిఖీలు నిర్వహించి గుట్టు రట్టు చేశారు. నిందితుడి వద్ద మొత్తం 10.79కేజీల బరువున్న 65 బంగారు బిస్కెట్లు ఉన్నాయని, వాటి విలువ రూ.5.76 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ పసిడి విదేశీ మూలాలకు చెందిందని పేర్కొన్నారు. లగేజీ బ్యాగులో ఓ బ్లాంకెట్ మధ్యలో పాస్టిక్​ కవర్లో బంగారాన్ని నిందితుడు దాచినట్లు వివరించారు.

ఇదీ చూడండి : అమరావతి ఎంపీ 'నవనీత్​ రాణా'కు మరో షాక్​.. ఆ వీడియో రిలీజ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.