IDBI Executive Recruitment 2023 : బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) రెండు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా 1,172 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో 136 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి కాకుండా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1,036 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది.
స్పెషలిస్టు క్యాడర్ ఆఫీసర్ పోస్టుల ఎంపిక ప్రక్రియ
ఈ పోస్టులకు జూన్ 1 నుంచి 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ఉద్యోగాలు అన్నింటికీ గతంలో పనిచేసిన అనుభవం తప్పనిసరి అని స్పష్టం చేశారు. వీరికి కనిష్ఠంగా రూ.29 వేలు, గరిష్ఠంగా రూ.1,55,000 వరకు జీతం ఇస్తారు.
- మేనేజర్ పోస్టులు - 84
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్ - 46
- డిప్యూటీ జనరల్ మేనేజర్ - 6
ఎగ్జిక్యూటివ్ (కాంట్రాక్ట్) పోస్టుల ఎంపిక ప్రక్రియ
కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకునే ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మే 24 నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ, జూన్ 7వ తేదీతో ముగియనుంది.
పరీక్ష ఎప్పుడు?
జూలై 2న ఆన్లైన్లో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. కానీ పరీక్ష తేదీలు మార్చే అవకాశం కూడా ఉంటుందని సూత్రప్రాయంగా స్పష్టం చేశారు.
వయోపరిమితి
IDBI Age Limit : అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 ఏళ్లు ఉండాలి. అయితే ప్రభుత్వ నియమాల ప్రకారం కేటగిరిల వారీగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
విద్యార్హతలు
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
పరీక్ష ఫీజు ఎంత
IDBI Executive Exam Fee: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.200గా.. మిగతా అన్ని కేటగిరిల అభ్యర్థులకు రూ.1000 పరీక్ష ఫీజు నిర్ణయించారు.
పోస్టుల భర్తీ.. కొనసాగింపు
IDBI Executive Selection Process : ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ నిర్వహించి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాదిపాటు ఒప్పంద ప్రాతిపదికపైన పనిచేయాలి. ఆ తరువాత వారి పనితీరును అనుసరించి ఏటా సర్వీసును పొడిగిస్తూ ఉంటారు.
వేతనం ఎంత ఉండొచ్చు
IDBI executive salary : ఒప్పంద ఉద్యోగులకు తొలి ఏడాది రూ.29 వేలు, రెండో ఏడాది రూ.31 వేలు, మూడో సంవత్సరం రూ.34 వేలు చొప్పున వేతనం ఇస్తారు. పూర్తి వివరాల కోసం ఐడీబీఐ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
ఇవీ చదవండి: Bank jobs 2023 : ఐబీపీఎస్ భారీ నోటిఫికేషన్.. పోస్టులు, దరఖాస్తు వివరాలు ఇలా..
పోస్టాఫీసుల్లో భారీగా ఉద్యోగాలు.. పదో తరగతి పాసైతే చాలు.. పరీక్ష లేకుండానే జాబ్