ETV Bharat / bharat

ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్ చేస్తారా? ఈ భారీ నోటిఫికేషన్ మీ కోసమే!

author img

By

Published : Jun 5, 2023, 1:14 PM IST

IB Recruitment 2023 : ఇంటెలిజెన్స్​ బ్యూరో(ఐబీ)లో జూనియన్​ ఇంటెలిజెన్స్​ ఆఫీసర్​ పోస్టులకు నోటిఫికేషన్​ విడుదల అయ్యింది. ఐబీ ఈ సారి భారీ స్థాయిలో 797 పోస్టులను భర్తీ చేయనుండడం విశేషం. ఆసక్తి గల అభ్యర్థులు జూన్​ 23 లోగా ఆన్​లైన్​లో​ అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీకోసం..

IB job notification 2023
IB Recruitment 2023

IB JIO Recruitment 2023 : నిరుద్యోగులకు శుభవార్త. ఇంటెలిజెన్స్​ బ్యూరో భారీ స్థాయిలో జూనియర్​ ఇంటెలిజెన్స్​ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్​ ద్వారా 797 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ 2023 జూన్​ 3 నుంచే ప్రారంభమైంది. జూన్​ 23 వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వైబ్​సైట్​లో అప్లై చేసుకోవచ్చు.

పరీక్ష ఫీజు :
జనరల్​, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్​మెన్​లకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్​ విడుదల - మే 30, 2023
  • ఆన్​లైన్ దరఖాస్తులు ప్రారంభం - జూన్​ 3, 2023
  • దరఖాస్తుకు చివరి తేదీ - జూన్​ 23, 2023
  • ఆన్​లైన్​ పేమెంట్​కు చివరి తేదీ - జూన్​ 27, 2023

వయో పరిమితి
ఐబీ జూనియర్​ ఇంటెలిజెన్స్ ఆఫీసర్​ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

విద్యార్హతలు
అభ్యర్థులు ఇంజినీరింగ్​ డిప్లొమా కలిగి ఉండాలి. ముఖ్యంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో లేదా విద్యా సంస్థల్లో ఎలక్ట్రానిక్స్​, టెలికమ్యూనికేషన్​, కంప్యూటర్​ సైన్స్​ స్ట్రీమ్​ల్లో ఇంజినీరింగ్​ డిప్లొమా చేసి ఉండాలి. లేదా బ్యాచిలర్​ డిగ్రీలో ఎలక్ట్రానిక్స్​, కంప్యూటర్​ సైన్స్​, ఫిజిక్స్​, మ్యాథ్స్​ లాంటి స్పెషలైజేషన్స్​ చేసి ఉండాలి. అది కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థలో చదివి ఉండాలి.

కేటగిరిల వారీగా పోస్టులు

  • UR (అన్​ రిజర్వ్​డ్​) - 325
  • EWS (ఎకనామికల్లీ వీకర్​ సెక్షన్స్​) -79
  • OBC - 215
  • SC - 119
  • ST - 59
  • మొత్తంగా 797 జూనియర్​ ఇంటెలిజెన్స్ ఆఫీసర్​ పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఆన్​లైన్​లో ఎలా అప్లై చేసుకోవాలి?

  • స్టెప్​ 1: అధికారిక వెబ్​సైట్​ https://www.mha.gov.in/en ను ఓపెన్​ చేయాలి
  • స్టెప్​ 2: రిక్రూట్​మెంట్​ లేదా కెరీర్​ సెక్షన్​పై క్లిక్​ చేయాలి
  • స్టెప్​ 3: జూనియర్​ ఇంటెలిజెన్స్​ ఆఫీసర్​ నోటిఫికేషన్​ను క్లిక్​ చేసి, ఓపెన్​ చేయాలి.
  • స్టెప్​ 4: నోటిఫికేషన్​లో పొందుపరిచిన​ వివరాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా, విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు లాంటి అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలి.
  • స్టెప్​ 5: అప్లై ఆన్​లైన్​ లేదా రిజిస్ట్రేషన్​ లింక్​పై క్లిక్​ చేసి దరఖాస్తు నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్​లోడ్​ చేయాలి.
  • స్టెప్​​ 6: దరఖాస్తులో నింపిన వివరాలు మరోసారి సరిచూసుకోవాలి. అన్నీ సరిగ్గా ఉంటే పరీక్ష ఫీజు చెల్లించి, అప్లికేషన్​ కాపీని డౌన్​లోడ్​ చేసుకోవాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.