ETV Bharat / bharat

'ఫడణవీస్​కు సంబంధించి హైడ్రోజన్ బాంబు లాంటి వార్త చెప్తా' - దేవేంద్ర ఫడణవీస్

1993 ముంబయి పేలుళ్ల కేసు దోషులతో తనకు సంబంధం ఉందని దేవేంద్ర ఫడణవీస్ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్(nawab malik fadnavis)​. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పఢణవీస్​కు సంబంధించి హైడ్రోజన్ బాంబు లాంటి విషయం బయటపెడతానన్నారు(nawab malik devendra fadnavis ).

Nawab Malik
Nawab Malik
author img

By

Published : Nov 9, 2021, 7:15 PM IST

భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్​పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్(nawab malik fadnavis). తనకు 1993 పేలుళ్ల కేసు దోషులతో సంబంధముందని ఆయన చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. తన ప్రతిష్ఠను మసకబార్చేందుకే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫడణవీస్​కు సంబంధించి హైడ్రోజన్ బాంబు లాంటి విషయం రేపు వెల్లడిస్తానని, ఆయనకే అండర్​వరల్డ్​తో సంబంధాలున్నాయని మాలిక్ చెప్పారు(nawab malik devendra fadnavis).

తనకు సంబంధించిన స్థలంలో డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నారని గతంలో కూడా తప్పుడు ఆరోపణలు చేశారని మాలిక్ విమర్శించారు(Nawab Malik news). తనపై దుష్ప్రచారం చేస్తున్న ఫడణవీస్​కు లీగల్​ నోటీసులు పంపుతనని పేర్కొన్నారు.

నవాబ్​ మాలిక్​కు సంబంధించి దీపావళి తర్వాత బాంబు పేల్చుతానని గతంలో చెప్పిన ఫడణవీస్ మంగళవారం మీడియాతో సమావేశమయ్యారు. మాలిక్​కు 1993 పేలుళ్ల దోషులతో సంబంధాలున్నాయని పలు ఆధారాలు చూపారు. వీటిని ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​కు కూడా పంపుతానన్నారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదీ చదవండి: 'రఫేల్​ ఒప్పందంపై భాజపా 'కవర్​-అప్'​ మరోసారి బయటపడింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.