ETV Bharat / bharat

అత్తతో 'చపాతీ' లొల్లి.. కోడలి చెవి పగలగొట్టిన కొడుకు! - చపాతీ గొడవ

Chapathi Issue: సాధారణంగా చాలా ఇళ్లల్లో అత్తా కోడళ్ల మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతుంటాయి. కాసేపటికే మళ్లీ వారు కలిసిపోతుంటారు. కానీ మహారాష్ట్రలో జరిగిన ఓ అత్తాకోడలు మధ్య గొడవ.. కోడల్ని ఆసుపత్రి పాలు చేసింది. అసలు ఆ గొడవకు కారణం ఏంటంటే చపాతి బాగా చేస్తావా? అని అడగడం. అసలేమైందంటే?

Maharastra Chapathi Issue:
Maharastra Chapathi Issue:
author img

By

Published : Jun 1, 2022, 10:41 AM IST

Maharastra Chapathi Issue: 'చపాతీ బాగా చేస్తావా నువ్వు?' అని ఓ అత్త అడిగిన ప్రశ్నకు కోడలు అడ్డదిడ్డంగా సమాధానమిచ్చింది. దీంతో వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అది విన్న ఆమె కొడుకు వచ్చి భార్య చెవి పగిలిపోయేలా రాయితో కొట్టాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

ఏం జరిగిందంటే.. నిందితుడు అశ్విన్ నికుంభ్(32) కుటుంబం.. బద్లాపుర్‌కు తూర్పున ఉన్న షిర్‌గావ్ ప్రాంతంలోని మౌలీచౌక్‌లోని ఓ భవనంలో నివసిస్తోంది. సోమవారం రాత్రి అతడి భార్య కోమల్ (22) వంటగదిలో భోజనం సిద్ధం చేస్తోంది. ఆ సమయంలో ఆమె అత్త వచ్చి చపాతీ బాగా చేస్తావా? అని అడిగింది. అయితే అప్పుడు ఆమె కాస్త వెటకారంగా సమాధానమిచ్చింది.

'మా అత్తగారిని దృష్టిలో పెట్టుకుని మంచిగానే తయారు చేస్తాను' అని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ గొడవ విన్న అశ్విన్ తన భార్య కోమల్ ఎడమ చెవిపై రాయితో బలంగా కొట్టాడు. దీంతో ఆమె కర్ణభేరి పగిలింది. అంతటితో ఆగకుండా బెల్టుతో కూడా కొట్టాడు. వెంటనే ఆమె పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, భర్త అశ్విన్‌పై ఫిర్యాదు చేసింది. 325, 324, 504 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

ఇవీ చదవండి: 'దేశంలో జనాభా నియంత్రణకు త్వరలోనే కొత్త చట్టం'

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. తగ్గిన మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.