వరకట్న వేధింపులతో భర్తే భార్యను చంపేశాడని అత్త మామలు ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. దింతో ఆ వ్యక్తి ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాడు. ఆరు నెలల అనంతరం ఆ చనిపోయిందనుకున్న మహిళ తన తల్లిగారింట్లో క్షేమంగా ఉంది. ఈ ఘటన బిహార్లోని సీతామఢీ జిల్లా చోరౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. పరిగావన్ గ్రామానికి చెందిన శశి కుమార్కు నెపాల్కు చెందిన హీరాదేవీతో వివాహం అయింది. వీరిద్దరికి ఏడాది కుమారుడు ఉన్నాడు. 7 నెలల కిందట వరకట్న వేధింపులతో భర్త శశి కుమార్, బావ సంజయ్ మహతో, అత్త సుమిత్రా దేవీ నిప్పంటించి తగలబెట్టారని హీరాదేవీ తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. శశి కుమార్ని అరెస్టు చేశారు. శశి ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాడు.
అయితే పోలీసు విచారణ సమయంలో హీరాదేవీ తన తల్లిగారింట్లో క్షేమంగా ఉందని తెలిసిందని పోలీసులు తెలిపారు. తర్వాత అతడిని కోర్టులో హాజరు పరిచి, వాంగ్మూలం తీసుకున్నామన్నారు. హీరాదేవి మతిస్తిమితం బాగోలేదని ఆమె తరఫు కుటుంబసభ్యులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఆమెను శశి.. ముజఫర్‌పుర్ రైల్వే స్టేషన్లో దిగబెట్టాడని.. తప్పిపోయిన ఆమె.. అక్కడ నుంచి వెతుక్కుంటూ నేపాల్లోని మటిహని పోలీస్ స్టేషన్ పరిధిలోని తన తల్లిగారింటికి చేరుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు వివరించారు.
ఇవీ చదవండి: కొండ చిలువకు ప్లాస్టిక్ సర్జరీతో పునర్జన్మ
అమిత్ షా టూర్లో కలకలం.. ఆంధ్రా ఎంపీ పీఏ అంటూ హల్చల్.. చివరకు...