ETV Bharat / bharat

కశ్మీర్​లో భారీగా ఆయుధాలు.. పంజాబ్​లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు - జమ్ము కశ్మీర్ ఆయుధాలు

కశ్మీర్​లో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు. ఎనిమిది ఏకేఎస్-ర74 రైఫిళ్లు, 12 చైనా పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సైనికాధికారులు తెలిపారు. మరోవైపు, డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు కీలక నిందితులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

huge-cache-of-arms-found-in-jammu-kashmir

author img

By

Published : Dec 25, 2022, 7:55 PM IST

జమ్ము కశ్మీర్‌ బారాముల్లాలో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. హత్‌లంగా సెక్టర్‌లో సైన్యం, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్‌ సందర్భంగా పెద్దమొత్తంలో ఆయుధాలను గుర్తించినట్లు సైనికాధికారులు తెలిపారు. ఎనిమిది ఏకేఎస్-74 రైఫిల్స్‌, వాటికి సంబంధించి 24మ్యాగ్‌జైన్ల బుల్లెట్లు, 560 లైవ్‌ రైఫిల్‌ రౌండ్స్‌, 24 మ్యాగ్‌జైన్లతో 12 చైనా పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సైన్యం పట్టుకున్న డంప్‌లో 224 లైవ్‌ పిస్టల్‌ రౌండ్స్, 14 పాకిస్తాన్‌, చైనా గ్రనేడ్లతోపాటు పాక్‌ జాతీయ జెండాతో ఉన్న 81 బెలూన్లు ఉన్నాయి. ఉగ్రవాదులకు ఏకేఎస్-74 రైఫిల్‌ లాంటి ఆధునాతన ఆయుధాలు ఇచ్చి భారత్‌లోకి ప్రవేశించేందుకు పాక్‌ దళాలు సహకారం అందిస్తున్నాయని సైన్యం ఆరోపించింది. ఈ ఏడాదిలో కశ్మీర్‌లో ఇంత భారీమొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం ఇదే ప్రథమమని సైన్యం తెలిపింది.

huge-cache-of-arms-found-in-jammu-kashmir
కశ్మీర్​లో బయటపడ్డ ఆయుధాలు

మరోవైపు, పంజాబ్​లో ఇద్దరు డ్రగ్ స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదకద్రవ్యాలను భారత్​కు స్మగ్లింగ్ చేస్తున్న నెట్​వర్క్​లో నిందితులు కీలక వ్యక్తులని పోలీసులు తెలిపారు. వీరితో పాటు పది కేజీల హెరాయిన్, హైటెక్ డ్రోన్​ను సైతం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను దల్బీర్, జగ్దీశ్​లుగా గుర్తించారు. మూడేళ్లుగా వీరు మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. డ్రోన్ ద్వారా వీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులు చెప్పారు. అమెరికాలో తయారైన ఈ డ్రోన్​లో సుదీర్ఘ బ్యాటరీ సామర్థ్యం, ఇన్​ఫ్రారెడ్ నైట్ విజన్ కెమెరా వంటి అత్యాధునిక సాంకేతికతలు ఉన్నాయని తెలిపారు. ఇది నెల రోజుల వ్యవధిలో లభ్యమైన ఐదో డ్రోన్ అని చెప్పారు. హరియాణా, దిల్లీలో వీరికి చాలా నెట్​వర్క్ ఉందని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించారు. మరిన్ని డ్రగ్స్ దొరికే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

punjab drug cartel
డ్రోన్, డ్రగ్స్​తో పంజాబ్ పోలీసులు
punjab drug cartel
పంజాబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రోన్, డ్రగ్స్
punjab drug cartel
పోలీసుల అదుపులో నిందితులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.