ETV Bharat / bharat

మీ కారు విండ్‌ షీల్డ్‌పై పగుళ్లు వచ్చాయా? ఇలా సెట్ చేయండి! - కార్ విండ్‌షీల్డ్ క్రాక్‌ని ఎలా ఆపాలి

How To Stop Car Windshield Crack From Spreading : మీ కారు విండ్‌షీల్డ్‌పై పగుళ్లు ఏర్పడ్డాయా ? పగుళ్లు విస్తరించకుండా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా ? అయితే ఈ స్టోరీ మీ కోసమే.. కొన్ని చిన్న టిప్స్‌ పాటించడం వల్ల విండ్‌షీల్డ్ సమస్యకు చెక్‌ పెట్టవచ్చని ఆటోమొబైల్‌ నిపుణులు చెబుతున్నారు. పగుళ్లను ఏ విధంగా నివారించవచ్చు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

How To Stop Car Windshield Crack From Spreading

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 2:11 PM IST

How To Stop Car Windshield Crack From Spreading : కారును ఎంతో ఇష్టంతో కొనుగోలు చేస్తారు. చిన్న గీత పడినా తట్టుకోలేరు. అలాంటి కారు విండ్‌షీల్డ్‌పై ఉన్నట్టుండి పగుళ్ల ఆనవాళ్లు కనిపిస్తే.. ఎలా ఉంటుంది? హృదయం ముక్కలవుతుంది! అసలు.. ఈ పగుళ్లు ఎందుకు వస్తాయంటే.. రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు చిన్న చిన్న రాళ్లు గ్లాస్‌పై పడుతూ ఉంటాయి. ఇలా సమస్య మొదలవుతుంది.

సాధారణంగా కారు విండ్‌షీల్డ్‌పై పగుళ్లు మొదట చాలా చిన్నవిగా ఉంటాయి. కొన్ని సార్లు ఇవి కనపడక పోవచ్చు కూడా! రోజులు గడిచేకొద్దీ విండ్‌షీల్డ్‌పై పగుళ్లు విస్తరిస్తూ ఉంటాయి. అయితే.. వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. మొదట్లో చిన్నగా ఏర్పడ్డ పగుళ్లు.. ఆ తర్వాత పెద్దగా విస్తరించి, చివరికి పగిలిపోయే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా.. ఈ పగుళ్లను ఎక్కువ కాకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పగుళ్లను తగ్గించడానికి కొన్ని చిట్కాలు..

సూపర్‌ గ్లూ (Superglue) :
సూపర్‌గ్లూ ఇప్పుడు మార్కెట్లో విస్తృతంగా లభిస్తోంది. ఇది పగిలిన వస్తువులను త్వరగా అతికించడానికి చాలా బాగా పనిచేస్తుంది. పగిలిన విండ్‌షీల్డ్‌పై సూపర్‌గ్లూని ఉపయోగించడం వల్ల పగుళ్లు మరింతగా విస్తరించకుండా ఉంటాయి. సూపర్‌గ్లూను ఉపయోగించే ముందు విండ్‌ షీల్డ్‌పై పగుళ్లు వచ్చిన ప్రదేశాన్ని ఆల్కహాల్, గ్లాస్ క్లీనర్లు లేదా సబ్బు నీటితో శుభ్రం చేసి పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తరవాతే పగుళ్లు వచ్చిన చోట సూపర్‌గ్లూను అప్లై చేయాలి.

నెయిల్ పాలిష్‌లు (Nail Polish) :
సూపర్‌గ్లూ మాదిరిగా నెయిల్ పాలిష్‌ కూడా విండ్‌షీల్డ్‌పై వచ్చే పగుళ్లను పెద్దవిగా కాకుండా పని చేస్తాయి. పగుళ్లను నివారించడం కోసం కలర్‌లెస్ నెయిల్‌ పాలిష్‌లను ఉపయోగించాలి. ఇవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పగుళ్లపై నెయిల్‌ పాలిష్‌ను ఉపయోగించడం వల్ల అవి అతక్కుపోతాయి. దీని వల్ల పగుళ్లు మరింత విస్తరించకుండా ఉంటుంది.

విండ్‌షీల్డ్‌ రిపేర్ కిట్‌ (Windshield Repair Kit) :
మార్కెట్లో విండ్‌షీల్డ్‌ రిపేర్ కిట్‌ అందుబాటులో ఉంటుంది. దీనిని పంక్చర్ కిట్‌లా ఉపయోగించవచ్చు. సొంతంగా చేసుకోవడం సాధ్యం కాకపోతే.. విండ్‌షీల్డ్‌ రిపేర్‌ స్పెషలిస్టులను సంప్రదించండి మంచిది. వారు పగుళ్ల సమస్యను పర్ఫెక్ట్‌గా పరిష్కరిస్తారు.

కారు మైలేజ్ తగ్గిపోతోందా? ఈ టిప్స్ పాటిస్తే సూపర్‌ మైలేజ్!

ఈ జాగ్రత్తలు పాటించండి..
ఒకవేళ మీ కారు విండ్‌షీల్డ్‌పై చిన్న పగుళ్లు ఉంటే.. కారును ఎండలో పార్క్ చేయకండి. ఎండలో ఉంచితే అధిక వేడితో పగుళ్లు మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. అలాగే.. ఎక్కువగా ఎండ ఉండే మధ్యాహ్న సమయంలో ప్రయాణానికి దూరంగా ఉండటం మంచిది.

ఆ రోడ్లపై వద్దు :
విండ్‌షీల్డ్‌ పగిలిన కారుతో.. ఎగుడుదిగుడుగా, గుంతలుగా ఉండే రోడ్లపై అధిక వేగంతో ప్రయాణించడం మంచిది కాదు. దీనివల్ల పగుళ్లు మరింత పెద్దవిగా మారతాయి. ఎక్కువ వేగంతో వెళ్లడం వల్ల వైబ్రేషన్స్‌ ఏర్పడి.. పగుళ్లు పెద్దవై, విండ్‌షీల్డ్‌ పూర్తిగా పగిలిపోయే అవకాశం ఉంటుంది. పైన చేసిన సూచనలు తేలికపాటి పగుళ్లకు మాత్రమే వర్తిస్తాయి. పగుళ్లు మరింత పెద్దవిగా ఉంటే.. వెంటనే నిపుణులను సంప్రదించి కొత్తవి అమర్చుకోవాలి.

దివాళీ ఆఫర్ - ఈ ఎలక్ట్రిక్ కారుపై భారీ డిస్కౌంట్​, అదిరే ఫీచర్లు మీ సొంతం!

దివాళీ టపాసులు - మీ కారు బూడిదైనా కావొచ్చు - ఈ సేఫ్టీ కంపల్సరీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.