ETV Bharat / bharat

కారు మైలేజ్ తగ్గిపోతోందా? ఈ టిప్స్ పాటిస్తే సూపర్‌ మైలేజ్!

How To Increase Car Mileage : మీ కారు తక్కువ మైలేజ్‌ ఇస్తోందా? కారు పాతదైనా.. కొత్తదైనా.. మైలేజ్‌ ఎక్కువగా ఇవ్వాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ఇవి పాటిస్తే.. తప్పక సూపరై మైలేజ్ వస్తుంది. మరి.. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

How To Increase Car Mileage
How To Increase Car Mileage
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 4:11 PM IST

How To Increase Car Mileage : పెరుగుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్‌ బంక్‌కు వెళ్లిన ప్రతీసారీ వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని చాలా మంది బాధపడుతున్నారు. ధరల పరిస్థితి ఇలా ఉంటే.. కారు మైలేజ్ తగ్గిపోవడం చాలా మందిని మరింతగా బాధిస్తూ ఉంటోంది. అయితే.. చిన్న చిన్న టిప్స్‌ పాటించడం ద్వారా కారు మైలేజీని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

టైర్లలో సరిపడ గాలి : కారులో ప్రయాణించే ముందు అన్ని టైర్లలో గాలి సమానంగా ఉందో లేదో చూసుకోవాలి. టైర్లలో కంపెనీ నిర్దేశించిన మోతాదు కంటే తక్కువ గాలి ఉన్నట్లయితే.. రన్నింగ్‌ లోడ్‌ పెరిగి మైలేజ్‌ భారీగా తగ్గిపోయే అవకాశం ఉంది.

ఇంజిన్ ఆఫ్ : మీరు కారును ఒక నిమిషం కంటే ఎక్కువసేపు ట్రాఫిక్‌లో ఆపాల్సి వస్తే.. ఇంజిన్‌ను ఆఫ్ చేయండి. దీని వల్ల అనవసరంగా ఫ్యూయల్ వృథా కాకుండా చూడవచ్చు. అలాగే రోడ్డుపై ఏదైనా పని మీద కారు ఆపాల్సి వస్తే, ఇదే పద్ధతిని ఫాలో అవ్వండి.

ట్రాఫిక్ తక్కువగా ఉండే రోడ్లు : మీరు వెళ్లాలనుకునే ప్రదేశానికి ఎలా వెళ్తే ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఉంటాము? ఏ సమయంలో వెళ్తే బాగుంటుంది ? అనే విషయాలను ఆలోచించండి. దీని కోసం గూగుల్‌ మ్యాప్‌లో తక్కువ ట్రాఫిక్‌ ఉండే రోడ్లు ఏవో చెక్‌ చేసుకోండి.

స్థిరమైన వేగంతో : మీరు కారును డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అనవసరంగా మితిమీరిన వేగంతో వెళ్లడం, అనవసరంగా బ్రేక్‌లను వేయడం తగ్గించుకుంటే మైలేజ్‌ను పెంచుకోవచ్చు. హైవేల మీద ఎక్కువ వేగంతో వెళ్లడం వల్ల సుమారు 30 శాతానికి పైగా మైలేజ్‌ కోల్పోతారు. అలాగే నగరంలోని రహదారులపై అనవసర బ్రేకింగ్, యాక్సిలరేషన్‌ కారణంగా సుమారు 5 శాతం మైలేజ్‌ తగ్గుతుంది.

మరింత మైలేజ్ ఇచ్చేలా మారుతి 'బడ్జెట్'​ కార్ అప్డేట్.. రూ.4.5లక్షలకే!

కారు బరువు : కారు ఎంత బరువుగా ఉంటే అంత ఎక్కువ ఫ్యూయెల్ ఖర్చవుతుంది. కాబట్టి, పెట్రోల్‌, డీజిల్‌ను ఆదా చేసుకోవడాని, చైల్డ్ సీట్లు, సైకిల్ రాక్, రూఫ్ రాక్, రూఫ్ బాక్స్ మొదలైన అనవసరమైన బరువు పరికరాలను కారులో ఉంచకండి. కారులో అవసరమైన వస్తువులు మాత్రమే ఉండేలా చూసుకోండి.

ఏసీని పొదుపుగా వాడండి : ఈ రోజుల్లో అధిక తేమ, కలుషితమైన గాలి వల్ల చాలా మంది కార్లలో ఏసీని ఉపయోగిస్తున్నారు. కానీ, ఎక్కువగా ఏసీని ఉపయోగించడం వల్ల మీ కారు మైలేజ్ తగ్గిపోతుందని మీకు తెలుసా! కొన్ని నివేదికల ప్రకారం, ఏసీని ఆన్‌ చేసుకొని ఫుల్‌ ట్యాంకు ఇంధనంతో మీరు 500 కిలోమీటర్లు ప్రయాణిస్తే, ఎసీని ఆఫ్‌ చేయడం ద్వారా అదే ఇంధనంతో 600 నుంచి 625 కిలోమీటర్‌ల దూరం ప్రయాణించవచ్చు.

గేర్ షిఫ్ట్ : మీ కారు మైలేజ్‌ని పెంచడంలో గేర్ షిఫ్టులు కీలక పాత్ర పోషిస్తాయి. తక్కువ గేర్‌లో ఎక్కువ దూరం ప్రయాణించడం ద్వారా ఇంజిన్‌పై అధిక ఒత్తిడి పడి మైలేజ్ తగ్గుతుంది. కాబట్టి, సాధ్యమైనంత త్వరగా ఎక్కువ గేర్‌కు మారాలి.

కార్ సర్వీస్ : కంపెనీ తెలిపిన విధంగా మీ కారును రెగ్యులర్‌గా సర్వీసింగ్ చేయడం వల్ల మీ కారు మైలేజ్‌ను పెంచవచ్చు. ఇలా సర్వీసింగ్‌ చేయించడం వల్ల కారు సరైన కండిషన్‌లో ఉంటుంది.

భారత్​లో దొరికే చౌకైన హైబ్రిడ్ కార్లు.. ఫీచర్లు సూపర్.. మీరూ ఓ లుక్కేయండి!

రూ.10 లక్షల్లోపు బెస్ట్​ కారు కావాలా? ఈ 3 బ్రాండ్స్ చెక్​ చేయండి - అదిరిపోయే​ ఫీచర్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.