ETV Bharat / bharat

Personal loan on Google Pay: మీ ఫోన్‌లో గూగుల్ పే ఉందా.. అయితే, మీకు లక్ష దాకా రుణం వచ్చేసినట్టే..! - undefined

How to Apply Personal loan on Google Pay: వినియోగదారులకు గూగుల్- పే శుభవార్తను చెప్పింది. మరి, అదేంటి..? దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉంది? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 19, 2023, 7:34 PM IST

Updated : Aug 19, 2023, 7:44 PM IST

How to Apply for a Personal Loan on Google Pay: గూగుల్‌కు చెందిన చెల్లింపు సేవల సంస్థ 'గూగుల్‌ పే (Google Pay)' తమ వినియోగదారుల కోసం మరో సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేమిటంటే..బ్యాంకులో ఏదైనా రుణం పొందాలంటే సవాలక్ష డాక్యుమెంట్లను సమర్పించాలి. కష్టపడి అవన్నీ సమర్పించినా.. కచ్చితంగా లోన్ వస్తుందని మాత్రం గ్యారెంటీ ఉండదు. కానీ, గూగుల్ పే ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండానే చాలా ఈజీగా లోన్ ఇచ్చేస్తోంది. మరీ ఎలా రుణం ఇస్తుంది..?, రుణం కోసం ఏయే పద్ధతులు అనుసరించాలి..?, ఎంత లోన్ అందిస్తుంది..? అనే తదితర వివరాలను తెలుసుకుందామా..

గూగుల్ పే ఉపయోగాలు..
What are the Uses of Google Pay: ఇంతకాలం మనీ ట్రాన్స్‌ఫర్‌కు ఎంతో సహకరించిన గూగుల్ పే తాజాగా తన కస్టమర్లకు ఓ శుభవార్తను చెప్పింది. ఈజీగా లోన్ పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఇకపై రుణం కోసం వినియోగదారులు బ్యాంకుకు వెళ్లకుండా సమయాన్ని ఆదా చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

గూగుల్ పేలో వ్యక్తిగత రుణం కోసం ఎలా దరఖాస్తు చేయాలి..?
How to apply for a personal loan on Google Pay:

  • ముందు మీ Google Pay స్క్రీన్‌లోని డబ్బు ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత లోన్స్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • దీంతో యాప్‌లోని లోన్ ఆఫర్‌ల విభాగం పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఆఫర్‌ల విభాగంలో ప్రీ-అప్రూవర్ లోన్ ఆఫర్‌లు వస్తాయి.
  • ఆఫర్‌లు మీ అవసరాలకు సరిపోతాయని భావిస్తే EMI ఆప్షన్‌ను ఎంపిక చేసుకోండి.
  • ఈఎంఐలో సరైన వివరాలు, అవసరమైన సమాచారాన్ని క్షుణ్ణంగా పూరించండి.
  • దరఖాస్తు చేసిన తర్వాత మీకు OTP వస్తుంది.
  • ఆ OTPని సూచించిన కాలమ్‌లో నమోదు చేయండి.
  • ఆ తర్వాత బ్యాంక్ మీ దరఖాస్తును తనిఖీ చేసే వరకు వేచి ఉండండి.
  • బ్యాంక్ దరఖాస్తును ధృవీకరించిన తర్వాత రుణాల ట్యాబ్‌ని తనిఖీ చేయండి.
  • అయితే, బ్యాంకులు మీ ఖాతాకు నిధులను బదిలీ చేసే ముందు ప్రాసెసింగ్ ఫీజు, లోన్ స్టాంప్ డ్యూటీలు తొలగించబడుతాయి.
  • ఆ తర్వాత నిధులు మీ ఖాతాకు బదిలీ చేయబడతాయి.

రుణాన్ని తిరిగి చెల్లించటం ఎలా..?
How to repay the loan: Google Pay ద్వారా రుణాన్ని తీసుకున్న తర్వాత తిరిగి ఎలా చెల్లించాలనే వివరాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  • గూగులో పేలో అనుబంధించబడిన బ్యాంక్ ఖాతా ద్వారానే రుణం తిరిగి చెల్లించబడుతుంది.
  • బ్యాంక్ నిబంధనల ప్రకారం..మీ ఖాతా నుంచి ఎప్పుడు EMIని మొత్తాన్ని చెల్లించాలో తేదీని కూడా వెల్లడిస్తుంది.
  • ప్రతి నెల నిర్దిష్ట తేదీలో మీ బ్యాంక్ ఖాతా నుండి EMI ఆటోమేటిక్‌గా చెల్లించబడుతుంది.
  • ఒకవేళ బ్యాంక్ ఖాతాలో EMIకి సరిపడా డబ్బు ఖాతాలో లేకపోతే, జరిమానా విధించబడుతుంది.
  • అంతేకాదు, క్రిడెట్ స్కోర్ కూడా తగ్గించబడుతుంది.
  • మరొకసారి రుణం తీసుకోవడానికి అడ్డంకి ఏర్పడుతుంది.

గూగుల్ పే ద్వారా ఎంత రుణం పొందొచ్చు..
How much loan can you get through Google Pay:

వినియోగదారుల సంఖ్య పెరిగేకొద్దీ Google Payలో వివిధ బ్యాంక్ ఖాతాల లింకుల సంఖ్య కూడా పెరిగింది. దీంతో మనీ ట్రాన్స్‌ఫర్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో వ్యక్తుల ఖర్చు, సామర్థ్యం, ఆదాయాన్ని బట్టి ఫెడరల్ బ్యాంక్, IDFC బ్యాంక్, DMI ఫైనాన్స్ వంటి బ్యాంకింగ్ దిగ్గజాలు.. గూగుల్ పే ద్వారా లోన్‌కు అర్హత ఉన్న యూజర్‌లకు 15% వార్షిక వడ్డీతో 36 నెలలకు రూ.10 వేల నుండి 1 లక్ష రూపాయల వరకు రుణాన్ని ఆఫర్ చేస్తున్నాయి. అంటే పది వేల నుంచి లక్ష వరకూ రుణాన్ని పొందొవచ్చు.

లోన్ కావాలంటే అర్హతలు ఏమిటి..?
What are the qualifications for a loan:

గూగుల్ పే ద్వారా రుణం పొందాలనుకునేవారికి కొన్ని అర్హతలు ఉండాలి. అందులో ముఖ్యంగా..పాన్ కార్డు నెంబర్, ఆధార్ కార్డు నెంబర్‌లను నమోదు చేసి, డాక్యుమెంట్లలోని చిరునామా వివరాలను ఎంటర్ చేయాలి. ఆ తరువాత లోన్ అర్హతపై డిక్లేర్ చేస్తుంది. అప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు స్క్రీన్‌పై కనబడతాయి. నమోదు చేసిన వివరాలకు ఎల్జిబిలిటీ ఉందా? లేదా? అని బ్యాంక్ నిర్థారించుకున్న తర్వాత డబ్బులు మీ అకౌంట్లోకి జమమవుతాయి.

లోన్ పొందే ముందు పాటించాల్సిన నియమాలు..
Rules to follow before getting a loan:

గూగుల్ పేలో రుణం పొందడం చాలా సులభతరమని తెలిసిన వెంటనే వెనక ముందు ఆలోచించకుండా వివరాలను నమోదు చేయొద్దు. దరఖాస్తు చేయడానికి ముందు మనం ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి. రీపేమెంట్ సామర్థ్యాన్ని అంచనా వేయాలి. మన రోజువారీ అవసరాలపై ఒత్తిడి లేకుండా అసలు మొత్తంపై చెల్లింపులు, వడ్డీని భరించగలమా..? లేదా..? అని నిర్ధారించుకోవాలి.

ఇవీ చదవండి..

గూగుల్ పే యూజర్లకు ఫ్రీగా రూ.88వేలు.. వెంటనే వాడుకుంటే ఓకే.. లేదంటే..!

డెబిట్ కార్డ్ లేకపోయినా UPI యాక్టివేషన్​.. ప్రాసెస్ ఇలా..

ఫ్రెండ్స్​తో రెస్టారెంట్ బిల్ షేర్​ చేసుకోవాలా..? గూగుల్​ పేలోని ఈ ఫీచర్​తో ఈజీగా కట్టొచ్చు

Last Updated : Aug 19, 2023, 7:44 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.