ETV Bharat / bharat

పెళ్లి చేస్తామని నమ్మించి దారుణం.. కిరాతకంగా చంపి.. కృష్ణానదిలో పడేసి.. - karnataka latest updates

ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. పెద్దలు నిరాకరించినా.. ఒక్కటవ్వాలని అనుకున్నారు. కానీ తమ తల్లిదండ్రులే ప్రాణహాని కలిగిస్తారని ఊహించలేదు. పరువు కోసం కన్నబిడ్డను, ఆమెను ప్రేమించిన వ్యక్తిని కడతేర్చారు ఆ బాలిక కుటుంబ సభ్యులు.. అసలేమైందంటే..?

honour killing in karnataka
karnataka honour killing case
author img

By

Published : Oct 19, 2022, 11:10 AM IST

కర్ణాటకలో ఇటీవల కనపడకుండా పోయిన ప్రేమికులు హత్యకు గురయ్యారు. వారి ప్రేమను నిరాకరించిన బాలిక కుటుంబ సభ్యులే ఈ దారుణానికి పాల్పడ్డారు. అక్టోబర్ 1న ఈ ఘటన జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగింది: కర్ణాటకలోని గడగ్​ జిల్లాకు చెందిన విశ్వనాథ్​ అనే యువకుడు బేవినమట్టి ప్రాంతంలో ఉండే ఓ బాలిక ప్రేమించుకున్నారు. కొంత కాలంగా సాగిన వీరి ప్రేమవిషయం పెద్దల చెవిన పడగా వారు ఆగ్రహించారు. తరచూ బాలిక తల్లిదండ్రులు వారిద్దరిని హెచ్చరించేవారు. అయినా ఈ ప్రేమ జంట దూరం కాలేదు. ఫోన్​ ద్వారా మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే విశ్వనాథ్​ను తప్ప తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోనని ఇంట్లో చెప్పింది బాలిక.

దీంతో వీరిద్దరిని అంతమెందించాలని నిర్ణయించుకున్న బాలిక కుటుంబసభ్యులు.. పెళ్లి చేస్తామని నమ్మించి ఆ ఇద్దరిని పిలిపించుకున్నారు. బాలిక సోదరుడు తన బంధువులతో కలిసి.. అక్టోబర్ ​1న సుమారు 3 గంటల సమయంలో ఇరువురిని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం దారుణంగా హత్య చేశారు. గొంతుకు చున్నీ కట్టి బాలిక ప్రాణాలు తీశారు. విశ్వనాథ్​ వ్యక్తిగత భాగాలతో పాటు ఛాతీపై రాయితో కొట్టి చంపేశారు. ఇన్నర్స్ మినహా దుస్తులను తొలగించి మృతదేహాలను ఆల్మట్టి బ్రిడ్జ్​పై నుంచి కృష్టా నదిలోకి పారేశారు.

karnataka honour killing
హత్యకు గురైన విశ్వనాథ్​

కొడుకు ఆచూకీ తెలియని విశ్వనాథ్ తండ్రి పోలీసులను ఆశ్రయించారు. అక్టోబర్ 3న నర్గుంద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు బాలిక తండ్రి సైతం అక్టోబర్ 11న తమ బాలిక అపహరణకు గురయ్యిందని ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగా అక్టోబరు 15న బాగలకోటే రూరల్ పోలీసులు బాలిక సోదరుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడింది. బాలిక సోదరుడు రవి హుల్లన్నవరతో పాటు బంధువులైన హనుమంత మల్నాదాడ, బీరప్ప దళవాయిలను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన వాహనాన్ని సీజ్​ చేసిన పోలీసులు తదుపరి విచారణ ముమ్మరం చేశారు. అయితే ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.