Honey Trap lady: తన అందంతో ప్రముఖులను వలలో వేసుకుని వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న చిత్రాలు, వీడియోలు చూపించి తర్వాత పెద్ద మొత్తం డిమాండ్ చేస్తున్న ఘటనలో శుక్రవారం భువనేశ్వర్ పోలీసులు అరెస్టు చేసిన అర్చన అనే మహిళకు సంబంధించిన కీలకమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఆమె వద్ద స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ హార్డ్ డిస్క్, చరవాణుల్లోని దృశ్యాలు, చిత్రాల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆమెను విచారిస్తున్నారు.
ఆమెకు భువనేశ్వర్‌లో విశాలమైన భవనం ఉంది. ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో సంపన్నులు, ఉన్నతాధికారులతో స్నేహం చేస్తుంది. తర్వాత మాటలతో ముగ్గులోకి దింపి తన నివాస భవనంలోకి రప్పించుకునేది. వారితో సన్నిహితంగా మెలిగి వాటిని రహస్యంగా చిత్రీకరించేది.
తర్వాత తాను అడిగినంత ఇవ్వకపోతే ఆ వీడియోలు, చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో ఉంచుతానని బెదిరించేది. కొంతమంది పోలీసు అధికారులు కూడా ఆమె వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆమెకు బీఎండబ్ల్యూ, ఫోర్డు తదితర కంపెనీల ఖరీదైన కార్లున్నాయి. ఫార్మ్ హౌస్ కూడా ఉంది.
ఇవీ చదవండి: రైల్లో మహిళకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వేధింపులు.. విచారణ కమిటీ వేసిన సీఎం
2024 లక్ష్యంతో భాజపా 'ఆపరేషన్ 144'.. 'పక్కా లోకల్' స్కెచ్‌తో రంగంలోకి మోదీ!