ETV Bharat / bharat

పెట్టుబడుల పేరుతో ఆన్​లైన్​లో​ ఘరానా​ మోసం.. రూ.300 కోట్లు టోకరా! - హరియాణా వార్తలు

Online gaming scam: ఆన్​లైన్​ యాప్​లో ఓ వ్యక్తి.. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి మోసపోయాడు. తీరా చేసేదేమీ లేక.. పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. జరిగిన ఆన్​లైన్​ మోసాన్ని ఛేదించారు. నిందితులు ఖాతా నుంచి లావాదేవీల వివరాలు చూసి షాక్​ అయ్యారు. సుమారు రూ.300 కోట్లు టోకరా చేసినట్లు గుర్తించారు. ఈ సంఘటన హరియాణాలో వెలుగు చూసింది.

online scam
online scam
author img

By

Published : Jun 24, 2022, 9:21 AM IST

Online gaming scam: ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టేందుకు పోలీసులు ఎన్ని విధాలుగా చర్యలు చేపట్టినా.. ఇంకా పలుచోట్లా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అమాయకులను ఆసరా చేసుకుని కొన్ని ఆన్‌లైన్‌ సంస్థలు/యాప్​లు నిలువునా దోపిడీ చేస్తున్నారు. తాజాగా హరియాణాలో ఓ ఆన్‌లైన్‌ ఘరానా మోసం బయటపడింది. సదరు వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం.. హిసార్​లోని పటేల్​నగర్​కు చెందిన చంద్రశేఖర్​ అనే వ్యక్తి తనకు జరిగిన ఆన్​లైన్​ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విన్​మనీ అనే మొబైల్​ గేమింగ్​ యాప్​లో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టానని, అయితే ఆ డబ్బు తిరిగి రాలేదని తెలిపాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. బాధితుడికి జరిగిన మోసాన్ని ఛేదించారు. విన్​మనీ యాప్‌లో ఫిర్యాదుదారుడు డిపాజిట్ చేసిన డబ్బు ..మహారాష్ట్రలోని ఓ బ్యాంకు ఖాతాకు వెళ్లిందని, ఆపై ఒడిశాలోని బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరిని జైపుర్‌లో, ఇద్దరిని గుజరాత్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ మోసానికి సంబంధించి చైనా, దుబాయ్‌లకు కూడా సంబంధాలు ఉన్నట్లు సమాచారం. నిందితుల్లో ఒకడైన ఆకాశ్​ నుంచి రూ.3 లక్షలకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జైపుర్​లో అతడికి 13 బ్యాంక్​ ఖాతాలున్నట్లు విచారణలో తేల్చారు. మరో నిందితుడు సచిన్ గుడాలియా ఖాతా నుంచి రూ.300 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. విచారణ పూర్తయ్యాక చర్యలు తీసుకుంటామని తెలిపారు.

"ప్రస్తుత రోజుల్లో నాన్​ బ్యాంకింగ్​ ఫైనాన్షియల్​ కంపెనీలు చాలా నడుస్తున్నాయి. వీరంతా అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నారు. టెలిగ్రామ్​ తదితర యాప్స్​ ద్వారా ప్రచారం చేసి ప్రజలను మభ్యపెడుతున్నారు. ఓ లింక్​ పంపి యాప్​ డౌనలోడ్​​ చేయిస్తున్నారు. ఇక ఆ తర్వాత యాప్​లో గేమ్స్​​ ఆడి గెలిస్తే రెట్టింపు డబ్బులు వస్తాయని ఎర వేస్తున్నారు. ముందు చిన్న మొత్తం డబ్బులు మదుపు పెట్టినప్పుడు లాభం సరైన సమయంలోనే డిపాజిట్​ చేస్తున్నారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేసమయాన్ని అదనుగా తీసుకుని మోసం చేస్తున్నారు. అలా ప్రజలు చిన్నపాటి పొరపాట్లతో రూ.లక్షల్లో మోసపోతున్నారు." అని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి: గ్రాండ్​గా కుక్క బర్త్​డే పార్టీ.. 100కేజీల కేక్​ కటింగ్.. ఐదు వేల మందికి భోజనాలు

శిందే తిరుగుబాటు సక్సెస్.. బలంగా రెబల్ క్యాంప్.. ఠాక్రేకు ఛాన్స్ ఉందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.