ETV Bharat / bharat

హిమాచల్​ సీఎం జైరాం ఠాకూర్ ఘన విజయం.. వరుసగా ఆరోసారి.. - హిమాచల్​ప్రదేశ్​ ఎన్నికల ఫలితాలు

సిరాజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హిమాచల్​ప్రదేశ్​ సీఎం జైరాం ఠాకూర్.. వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్​ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. 22,200 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందినట్లు ఈసీ వెల్లడించింది.

himachal pradesh election result
himachal pradesh election result
author img

By

Published : Dec 8, 2022, 12:27 PM IST

హిమాచల్​ప్రదేశ్​ సీఎం జైరాం ఠాకూర్.. తనసొంత నియోజకవర్గంలో భారీ మెజారిటీతో విజయం సాధించారు. మండీ జిల్లాలోని సిరాజ్ నియోజకవర్గంలో భాజపా నుంచి పోటీ చేసిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి చేత్​రామ్​పై 22,200 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.

దాదాపు 75,000 మంది ఓటర్లు ఉన్న ఈ స్థానానికి ఆరుగురు అభ్యర్థులు పోటీ చేశారు. సీపీఐ(ఎం)​ నుంచి మహేందర్​ సింగ్​, ఆప్ నుంచి గీతానంద్​, బీఎస్పీ నుంచి ఇంద్రాదేవి, స్వతంత్ర అభ్యర్థి నరేందర్​ కుమార్​లు బరిలోకి దిగారు. పోలైన ఓట్లలో 75 శాతానికి (47,490) పైగా ఓట్లు జైరాం ఠాకూర్ కైవసం చేసుకున్నారు. రెండోస్థానంలో నిలిచిన కాంగ్రెస్ నేత చేత్​రామ్​కు 21.47 శాతం (13,440) ఓట్లు వచ్చాయి.

1993లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు జైరాం ఠాకూర్​. అయితే ఆ ఎన్నికల్లో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. 26 ఏళ్ల వయసులోనే చచ్యోట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఆయన.. ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 1998లో మరోసారి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2003, 2007, 2012, 2017 ఐదుసార్లు అక్కడి నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత చచ్యోట్ స్థానం.. సిరాజ్​గా మారింది. ఇప్పుడు 57 ఏళ్ల వయస్సులో ఏడోసారి ఇక్కడి నుంచి బరిలో దిగి జయకేతనం ఎగురవేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.