ETV Bharat / bharat

కంట్రోల్ తప్పిన హెలికాప్టర్, విమానం.. లక్కీగా వందల మంది..

Helicopter saved from crash: ఓ ప్రైవేట్​ కంపెనీకి చెందిన హెలికాప్టర్​ ల్యాండింగ్​ సమయంలో అదుపు తప్పింది. ​పైలట్ చాకచాక్యంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా ల్యాండ్​ చేశాడు. ఈ ఘటన కేధార్​నాథ్​ యాత్రలో జరిగింది. మరో ఘటనలో ఒడిశాలో ఓ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ట్రైనీ పైలట్​కు గాయాలయ్యాయి.

Helicopter saved from crash
Helicopter saved from crash
author img

By

Published : Jun 6, 2022, 7:10 PM IST

Updated : Jun 6, 2022, 7:35 PM IST

కంట్రోల్ తప్పిన హెలికాప్టర్, విమానం.. లక్కీగా వందల మంది..

Helicopter saved from crash: కేధార్​నాథ్ యాత్రలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఓ ప్రైవేట్​ కంపెనీకి చెందిన హెలికాప్టర్​ ల్యాండింగ్​ సమయంలో అదుపు తప్పింది. ​పైలట్ చాకచాక్యంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా ల్యాండ్​ చేశాడు. హెలికాప్టర్​ దిగిన చోటుకు అత్యంత దగ్గర్లోనే వందల మంది యాత్రికులు ఉన్నారు. హెలికాప్టర్​ అదుపు తప్పడం చూసి వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. చివరకు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం మే 31 న జరగగా.. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి.

aircraft crash
కుప్పకూలిన విమానం
aircraft crash
ఎయిర్​స్ట్రిప్​లో విమానం

ఒడిశా డెంకనాల్ సమీపంలోని బిరసల్​ ఎయిర్​ స్ట్రిప్​ వద్ద ఓ విమానం అదుపు తప్పి కూలింది. జీఏటీఐ అనే ప్రైవేట్​ శిక్షణా సంస్థకు చెందిన సెస్నా 152 విమానం కూలినట్లు ఏవియేషన్​ నియంత్రణ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ట్రైనీ పైలట్​కు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. వీటీ-ఈయూడబ్యూ నంబరు గల విమానం ల్యాండింగ్​ సమయంలో రన్​వే పక్కకు దూసుకెళ్లింది. దీంతో విమానం ముందు భాగం ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు చెప్పారు.

ఇదీ చదవండి: Live Video: వ్యాన్​ను ఢీకొట్టిన బస్సు.. లక్కీగా ఆ ఇద్దరు...

Last Updated : Jun 6, 2022, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.