మధ్యప్రదేశ్‌ను భీకర వర్షాల అతలాకుతలం చేస్తున్నాయి. వరదల ధాటికి చంబల్, క్వారీ నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ నదుల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటింది. 1971 తర్వాత క్వారీ నదిలో నీటి మట్టం.. సాధారణ స్థాయి కంటే 10 మీటర్లు ఎక్కువగా ఉండడం ఇదే తొలిసారి. ఈ రెండు నదుల సమీపంలోని వందలాది గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
![floods in madhyapradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mp-mor-06-quarry-river-pkg-10021_03082021222048_0308f_1628009448_1060.jpg)
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మురైనా జిల్లాలో వరదల్లో చిక్కుకున్న ఏడుగురిని సైన్యం తమ హెలికాప్టర్ల ద్వారా రక్షించింది. గ్వాలియర్-చంబల్ ప్రాంతం, శివ్‌పురి, షివోపుర్ జిల్లాల్లోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దాతియా జిల్లాలో వరదల ధాటికి ఓ సింధ్ నదిపై ఉన్న ఓ వంతెన కూలిపోయింది.
సీఎం ఏరియల్ సర్వే..
మధ్యప్రదేశ్‌లో 1,225 గ్రామాలు.. వరదల వల్ల ప్రభావితమయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం తెలిపారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సాయంతో 5,950 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. 1,950 మంది ఇంకా వరద గుప్పిట్లో చిక్కుకునే ఉన్నారన్న ఆయన.. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు శివరాజ్.
![floods in madhyapradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12672879_65.jpg)
![mp cm areial survey in flood effected areas](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12672879_777.jpg)
![madhyapradesh floods](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12672879_33.jpg)
మోదీ ఫోన్..
మధ్యప్రదేశ్‌లో వరదల పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రానికి కేంద్రం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: దీదీకి మోదీ ఫోన్- ఆదుకుంటామని హామీ
ఇదీ చూడండి: వర్షాలకు కూలిన ఇల్లు- ఏడుగురు సజీవ సమాధి!