కర్ణాటకలో కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. తీర ప్రాంతమైన మాలంద్ సహా ఉత్తర కర్ణాటకలో వరదలు బీభత్సం సృష్టించాయి. మొత్తం 283 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు 31 వేలమందికిపైగా బాధితులను పునరావాస శిబిరాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు. కర్ణాటకవ్యాప్తంగా మొత్తం 237శిబిరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉత్తర కన్నడ, చిక్ మంగళూరు, కొడుగు, బెల్గాం జిల్లాల్లో భారీవర్షాల కారణంగా అపారనష్టం కలిగింది. దాదాపు 2,600 ఇళ్లు దెబ్బతినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదీ చదవండి:పిడుగుపాటుకు ఐదుగురు బలి