ETV Bharat / bharat

సమాధిలోని చిన్నారి మృతదేహం నుంచి తల మాయం.. ఆ పూజల కోసమేనా? - తమిళనాడు చెంగల్పట్టు క్రైమ్ న్యూస్

సమాధిలో ఉన్న మృతదేహం నుంచి తలను వేరు చేసిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. ఇలా చేయడం వెనుక చేతబడి వంటి కారణాలు ఉన్నాయా? లేక కేసును దారి మళ్లించేందుకే ఇలా చేస్తున్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

headless girl dead body
మొండెం లేని యువతి మృతదేహం
author img

By

Published : Oct 28, 2022, 1:42 PM IST

Updated : Oct 28, 2022, 7:02 PM IST

తమిళనాడులోని చెంగల్పట్టులో సమాధిలో ఉన్న ఓ బాలిక మృతదేహం నుంచి తలను తొలగించిన ఘటన కలకలం రేపింది. సమాధి దగ్గర పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పోలీసులకు లభించాయి. బాలిక తలను ఉపయోగించి ఏమైనా క్షుద్ర పూజలు చేశారా? కేసును దారి మళ్లించేందుకు ఇలా ఎవరైనా చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదీ జరిగింది..
చెంగల్పట్టులోని మధురాండగానికి చెందిన పాండ్యన్-నదియా దంపతుల కుమార్తె కృతిక. ఆమె అక్టోబరు 5న ఆరిమేడులోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో ఆమెపై విద్యుత్​ స్తంభం పడడం వల్ల తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన చికిత్స నిమిత్తం చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ అక్టోబరు 14వ తేదీన కృతిక మృతి చెందింది. మరుసటి రోజు బాలిక మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు.

కృతికకు ప్రమాదం జరిగినప్పుడు.. విద్యుత్ స్తంభంపై ఓ వ్యక్తి ఎక్కడం వల్లే అది కూలిపోయిందని మృతురాలి కుటుంబ సభ్యులు చిట్టమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన నిందితుడు.. బాధితురాలి కుటుంబ సభ్యులకు కేసును ఉపసంహరించుకోవాలని బెదిరించాడు. తీరా చూసేసరికి బాలిక సమాధి ధ్వంసం అయ్యింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు మళ్లీ ఫిర్యాదు చేశారు. మధురాండగం డీఎస్పీ దురైపాండియన్, జిల్లా కలెక్టర్ రాజేశ్ సమక్షంలో బాలిక మృతదేహాన్ని వెలికితీశారు. అప్పుడు ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. సమాధిలో నుంచి బాలిక మృతదేహం తీయగానే తల లేదు. అదే సమయంలో బాలిక సమాధి వద్ద నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఉన్నాయి.

ఇవీ చదవండి: 'దేశంలో పోలీసులందరికీ ఇక ఒకే యూనిఫాం!'

మానసిక రోగుల మధ్య ప్రేమ.. కుంగుబాటును జయించి, భార్యాభర్తలుగా కొత్త జీవితం

Last Updated : Oct 28, 2022, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.