ETV Bharat / bharat

మొండెం లేని యువకుడి మృతదేహం లభ్యం.. హత్యనా? లేక ఇంకేమైనా? - 17 years boy murder in up

అప్పుడే తిరిగొస్తానని ఇంట్లో చెప్పి బయటకెళ్లిన ఓ 17 ఏళ్ల యువకుడు.. గ్రామ పరిసరాల్లో విగతజీవిగా కనిపించాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఘటనాస్థలికి చేరుకోగా.. మొండెం లేని తమ కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

UP-MURDER
UP-MURDER
author img

By

Published : Jun 25, 2022, 12:43 PM IST

Updated : Jun 25, 2022, 1:13 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. దేవరియా జిల్లాలో మొండెం లేని ఓ యువకుడి మృతదేహం అనుమానాస్పదంగా లభ్యమైందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇది హత్యనా? లేక ఇంకేమైనా జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. లార్​ ప్రాంతానికి చెందిన రెహమాన్​ గురువారం సాయంత్రం​ తన ఇంటి నుంచి మోటార్​ సైకిల్​పై బయటకెళ్లాడు. కాసేపట్లో తిరిగి వస్తానని కుటుంబసభ్యులకు చెప్పాడు. అయితే ఎంతసేపటికీ అతడు తిరిగి రాకపోవడం తల్లిదండ్రులు భయపడ్డారు. ఫోన్​ చేస్తే స్విచ్ఛాఫ్​​ వచ్చింది. ఊర్లో పలు చోట్ల వెతికినా.. లాభం లేకుండా పోయింది. ఈ క్రమంలో సుతావర్​- చౌముఖ రహదారిపై శుక్రవారం ఉదయం.. మొండెం లేని మృతదేహం అనుమానాస్పదంగా ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతుడ్ని రెహమాన్​గా గుర్తించారు. బాధితుడి ఇంటికి 15 కిలోమీటర్లు దూరంలో అతడి​ మోటర్​సైకిల్ కూడా​ లభ్యమైందని పోలీసులు చెప్పారు. కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేశామని, త్వరలోనే నిందితులను అరెస్ట్​ చేస్తామని ఎస్పీ సంకల్ప్​ శర్మ తెలిపారు.

ఇవీ చదవండి: భార్యను కాటేసిన పాము.. డాక్టర్లకు క్లారిటీ కోసం భర్త ఏం చేశాడంటే?

వరుడిపై పరువునష్టం దావా.. రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్​.. బరాత్​ అయిపోవడమే కారణం!

Last Updated : Jun 25, 2022, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.