ETV Bharat / bharat

హాథ్రస్ హత్యాచారం కేసు దోషికి జీవిత ఖైదు - హత్రాస్ కేసులో ముగ్గురు నిర్దోషులు

హాథ్రస్​లో దళిత యువతి హత్యాచారం కేసులో ప్రధాన దోషికి జీవిత ఖైదు విధించింది ప్రత్యేక కోర్టు. ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. గురువారం ఈ తీర్పును వెల్లడించింది.

hathras-rape-murder-case-court-convicts-main-accused-acquits-three
హాథ్రస్ అత్యాచారం కేసు.. ముగ్గురిని నిర్దోషులుగా తేల్చిన కోర్టు.. ఒకరికి జీవిత ఖైదు
author img

By

Published : Mar 2, 2023, 6:12 PM IST

Updated : Mar 2, 2023, 6:52 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని హాథ్రస్​లో దళిత యువతిపై అత్యాచారం, హత్య కేసులో.. దోషికి ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. ప్రధాన నిందితుడు సందీప్ సింగ్​(20)కు జీవిత ఖైదు విధించింది. రూ.50వేల జరిమానా సైతం చెల్లించాలని ఆదేశించింది. ఐపీసీ, ఎస్​సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్ 304 ప్రకారం సందీప్​ను దోషిగా నిర్ధరించింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి, రాము, లవ్​కుశ్​ను​ నిర్దోషులుగా ప్రకటించింది. గురువారం కోర్టు ఈ తీర్పును వెల్లడించింది.
తీర్పుపై బాధితురాలి కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై తాము హైకోర్టుకు వెళ్తామన్నారు. "సందీప్​పై అత్యాచార ఆరోపణలు రుజువు కాలేదు.​ ఈ తీర్పు కేవలం హత్యకు సంబంధించినదే. అతడు అమాయకడు. దీనిపై మేము హైకోర్టుకు వెళతాం." అని సందీప్​ తరపు న్యాయవాది మున్నా సింగ్​ అన్నారు.

కేసు వివరాలు..
సెప్టెంబర్​ 14న యూపీలో దళిత యువతిపై నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం గొంతుకోసి హతమార్చేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితురాలిని తొలుత యూపీ అలీగఢ్​లోని జవహర్​లాల్​ నెహ్రూ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం దిల్లీలోని సఫ్దార్​ జంగ్​ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ యువతి చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మరణించింది.

అనంతరం బాధితురాలి అంత్యక్రియలను పోలీసులు బలవంతంగా నిర్వహించారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరణించిన రోజే హుటాహుటిన భౌతిక కాయాన్ని దిల్లీ నుంచి యూపీ తరలించి, తెల్లవారుజామున 3 గంటల సమయంలో కార్యక్రమం నిర్వహించారని పేర్కొన్నారు. అంత్యక్రియలను బంధువుల సమక్షంలో నిర్వహిస్తామని చెప్పినా పోలీసులు ఒప్పుకోలేదన్నారు. పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల అనుమతితోనే కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. హత్రాస్​ జిల్లా కలెక్టర్ సైతం అదే విషయాన్ని స్పష్టం చేశారు.

ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై యూపీ ప్రభుత్వం కూడా అనేక విమర్శలు ఎదుర్కొంది. తొలుత సిట్‌ దర్యాప్తునకు ఆదేశించిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. అనంతరం సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. దీంతో ఈ కేసు విచారణ సీబీఐ చేతికి చేరింది. ఇదే సమయంలో బాధితులకు సరైన న్యాయం జరగదని, విచారణను బదిలీ చేయాలని సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని పరిశీలించిన సుప్రీం కోర్టు.. అలహాబాద్​ హైకోర్టు ముందు సీబీఐ స్థాయీ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఘటనకు నిరసనగా ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. బాధితురాలి కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని కోరుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిరసనలు జరిగాయి.

Last Updated : Mar 2, 2023, 6:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.