ETV Bharat / bharat

యువకుడి దారుణ హత్య.. శరీరాన్ని కాల్చి.. గోనెసంచిలో కుక్కి.. అదే కారణమా?

27 ఏళ్ల యువకుడు హత్యకు గురయ్యాడు. ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన అతడు.. శవమై కనిపించాడు. సగం కాలిన శరీరంతో.. గోనే సంచిలో అతని మృతదేహాం లభ్యమైంది. బిహార్​లో ఘటన జరిగింది. మరోవైపు భర్తతో గొడవ పడి ఆరేళ్ల చిన్నారిని నదిలో పడేసింది ఓ తల్లి. బంగాల్​లో జరిగిందీ ఘటన.

half-burnt-dead-body-of-youth-found-in-sack-in-bihar
బీహార్‌లో గోనె సంచులలో యువకుడి మృతదేహం
author img

By

Published : May 1, 2023, 10:56 PM IST

బీహార్​లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన ఆ యువకుడు.. సగం కాలిన మృతదేహంతో గోనే సంచిలో పడి ఉన్నాడు. అది గమనించిన స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. గోపాల్​గంజ్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతుడ్ని 27 ఏళ్ల సాహెబ్​ అన్సారిగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాహెబ్​ అన్సారి, వృత్తి రిత్యా టైలర్​. అతడు గోపాల్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నట్వాన్ గ్రామానికి చెందిన వ్యక్తి. అతడి తండ్రి పేరు అన్సారీ. సాహెబ్​ ఏప్రిల్​ 26 రాత్రి.. భోజనం చేసి పడుకునేందుకు మేడపైకి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం కొడుకు ఇంకా కిందకి రాకపోవడం వల్ల,.. మేడ పైకి వెళ్లి చూసింది వాళ్ల అమ్మ. సాహెబ్ మేడపైన కనిపించకపోయో సరికి పనిమీద బయటకు వెళ్లాడు అనుకుంది. సాహెబ్​ ఎంతకి ఇంటికి రాకపోవడం వల్ల కంగారు పడ్డ కుటుంబ సభ్యులు.. చాలా చోట్ల వెతికారు. ఆచూకీ లభించని కారణంగా స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

గోనే సంచిలో సాహెబ్​ మృతదేహం..
శ్రీపుర్ ఓపీ ప్రాంతంలోని భగవాన్‌పుర్ గ్రామం సమీపంలో ఓ కాలువ వద్ద.. దుర్వాసన రావటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులుకు సమాచారం అందించారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మృతదేహం సాహెబ్​దేనని గుర్తించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకుని.. శవపరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. సాహెబ్​ మొహం సగం కాలిపోయి ఉందని వారు తెలిపారు.

"మా సోదరుడి మృతదేహం వద్ద ఓ సిమ్​ కార్డు, మోమొరి కార్డు, ఓ మహిళ పోటో లభ్యమైంది. మేము ఆ మహిళే మా సొదురుడ్ని హత్య చేయవచ్చని భావిస్తున్నాం. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నాం. లేక శతృత్వం అయినా ఉండొచ్చు." అని మృతుడి సోదరుడు తెలిపాడు. ఏదైన పోలీసుల విచారణ తరువాత తెలుస్తుందని అతడు అభిప్రాయపడ్డాడు.

ఆరేళ్ల చిన్నారిని నదిలో పడేసిన తల్లి..
భర్తతో గొడవపడి ఆరేళ్ల చిన్నారిని బ్రిడ్జ్​పై నుంచి నదిలోకి పడేసింది ఓ తల్లి. అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడేందుకు ప్రయత్నించింది. అది గమనించిన స్థానికులు.. ఆ మహిళ నిలువరించారు. ఆమె ఆత్మహత్య చేసుకోకుండా ఆపగలిగారు. చిన్నారిని సైతం అటుగా పడవలో వెళుతున్న కొంత మంది యువకులు కాపాడారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. బంగాల్​లోని ముషిదాబాద్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
చిన్నారి తల్లిని రోకేయా బీబీగా పోలీసులు గుర్తించారు. ఆమె రఘునాథ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లోని మొహల్‌దర్‌పరా ప్రాంతానికి చెందినదిగా వెల్లడించారు. మహిళ మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. చిన్నారికి ఆసుపత్రికి తరలించామని వారు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.