HAL Apprentice Jobs 2023 : ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) 647 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్స్, డిప్లొమా హోల్డర్స్, ఐటీఐ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ - 186
- డిప్లొమా అప్రెంటీస్ - 111
- ఐటీఐ అప్రెంటీస్ - 350
ట్రేడ్ విభాగాలు
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ - ఏరోనాటికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యునికేషన్, మెకానికల్, కెమికల్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, ఆర్ట్స్, కామర్స్, సైన్స్, ఫార్మసీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
- డిప్లొమా అప్రెంటీస్ - ఏరోనాటికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యునికేషన్, మెకానికల్, కెమికల్ ఇంజినీరింగ్, ల్యాబ్ అసిస్టెంట్, హోటల్ మేనేజ్మెంట్, నర్సింగ్ అసిస్టెంట్
- ఐటీఐ అప్రెంటీస్ - ఫిట్టర్, టూల్ అండ్ డై మేకర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్మెన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, పెయింటర్, షీట్ మెటల్ వర్కర్, మెకానిక్, కంప్యూటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, వెల్డర్, స్టెనోగ్రాఫర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్
విద్యార్హతలు
HAL Apprentice Eligibility : అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా డిగ్రీ, ఐటీఐ, డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి
HAL Apprentice Age Limit : అభ్యర్థుల వయస్సు 2023 జులై 21 నాటికి.. 17.5 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
HAL Apprentice Fee : హెచ్ఏఎల్ అప్రెంటీస్ ఉద్యోగాలకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు.
ఎంపిక విధానం
HAL Apprentice Selection Process : సెలక్షన్ కమిటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
ట్రైనింగ్
HAL Apprentice Training : అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు ట్రైనింగ్ ఉంటుంది.
స్టైపెండ్
HAL Apprenticeship stipend : గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.9,000; డిప్లొమా హోల్డర్లకు నెలకు రూ.8,000; ఐటీఐ అప్రెంటీస్లకు నెలకు రూ.8,000 చొప్పున స్టైపెండ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం
HAL Recruitment 2023 Apply Online : అభ్యర్థులు HAL అధికారిక వెబ్సైట్ https://hal-india.co.in/ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 ఆగస్టు 02
- ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరి తేదీ : 2023 ఆగస్టు 23
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు : 2023 సెప్టెంబర్ 4 నుంచి 16 వరకు