Man throws infant in Narmada: గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి తన 11 నెలల చిన్నారిని నర్మదా నదిలోకి విసిరేశాడు. ఉద్యోగం లేదన్న కారణంతో సొంత బిడ్డను చంపేసుకున్నాడు. జాలోర్ జిల్లా, సంచోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధేశ్వర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకోవాలని భావించి, చివరకు కుమారుడిని చంపేశాడు.
వివరాల్లోకి వెళ్తే..
నలోధార్ గ్రామానికి చెందిన ముకేశ్ అనే యువకుడు బిహార్‌లోని ముజఫర్‌పుర్‌కు చెందిన ఉష అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇరువురూ కలిసి అహ్మదాబాద్‌లో జీవనం సాగిస్తున్నారు. వీరికి 11 నెలల బాబు ఉన్నాడు. ముకేశ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. ఈ ఉద్యోగాన్ని పోగొట్టుకున్న తర్వాత కొద్దిరోజుల పాటు భిక్షాటన చేశాడు. అయితే, చేయడానికి ఉద్యోగం లేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవాలని పథకం రచించుకున్నారు. మొదటి ప్రయత్నం విఫలమైంది. దీంతో రెండో ప్రయత్నంలో భాగంగా తన కుమారుడిని వెంటబెట్టుకొని బయటకు వెళ్లాడు.
నిరుద్యోగంతో మనస్తాపానికి గురైన దంపతులు బిడ్డతో సహా కంకారియా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నారు. కానీ అక్కడ జనం రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల కుదరలేదు. దీని తర్వాత 11 నెలల చిన్నారిని తాతయ్యల వద్ద వదిలివేయాలని ముకేశ్ తన భార్యను కోరగా ఉష దానికి అంగీకరించింది. తాతగారి ఇంట్లో వదిలి పెడతానని తీసుకువెళ్లిన చిన్నారిని ముకేశ్.. సిద్ధేశ్వర్ గ్రామంలోని నర్మదా నదిలోకి విసిరాడు. బాబు కనిపించనందున చుట్టు పక్కల వాళ్లు కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేశారు. తన పోలీసు స్నేహితుడు చిన్నారి ఎక్కడని ప్రశ్నించగా.. ముకేశ్ మధ్యలోనే ఫోన్‌ని నదిలో విసిరేశాడు. పోలీసులు విచారణ చేయగా బాబును తానే నదిలో విసిరేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.
అనంతరం పోలీసులు కాలువలో చిన్నారి కోసం వెతకడం ప్రారంభించారు. ఘటనా స్థలానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామ సమీపంలో శుక్రవారం చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహానికి పోస్టుమార్టం పరీక్షల అనంతరం మున్సిపాలిటీ సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ముకేశ్‌ని అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి
వరుణుడి బీభత్సం, విరిగి పడిన కొండచరియలు, 22 మంది మృతి
టాబ్లెట్ షీట్‌పై వెడ్డింగ్ కార్డు, క్రియేటివిటీ అదుర్స్ కదా