ETV Bharat / bharat

క్రికెటర్ భార్యకు భాజపా టికెట్.. మోర్బీ బాధితుల్ని కాపాడిన వ్యక్తికి ఛాన్స్ - రవీంద్ర జడేజా భార్య

గుజరాత్​ ఎన్నికలకు కమళదళం నుంచి బరిలోకి దిగనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించింది భాజపా. టీమ్​ ఇండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబాకు కూడా టికెట్​ ఇచ్చినట్లు తెలిపింది.

gujarat elections candidates list
gujarat elections 2022
author img

By

Published : Nov 10, 2022, 1:46 PM IST

గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ గురువారం విడుదల చేసింది. 160 స్థానాల్లో పోటీ చేసేవారి పేర్లను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వెల్లడించారు. ఘట్లోదియా అసెంబ్లీ స్థానం నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మజురా నుంచి హోంమంత్రి హర్ష్ సంఘావి బరిలోకి దిగనున్నారని తెలిపారు. పాటీదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్​కు విరంగమ్ సీటును కేటాయించారు. అలాగే టీమ్​ ఇండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబాకు కూడా భాజపా తరఫున టికెట్​ ఇచ్చారు.

gujarat elections 2022
భూపేంద్ర పటేల్ సీట్​ ఖరారైనందుకు పార్టీ ఆఫీస్​ ముందు సంబరాలు చేసుకుంటున్న కార్యకర్తలు

ఈ జాబితాలో 14 మంది మహిళలు, 13 మంది ఎస్సీలు, 24 మంది ఎస్టీలకు చోటు కల్పించారు. ప్రస్తుత జాబితాలో 69 మంది సిట్టింగ్​ ఎమ్మెల్యేలకు మాత్రమే చోటు దక్కగా గత ఎన్నికల్లో గెలిచిన సభ్యులకు ఈసారి మొండిచేయి ఇచ్చినట్లే తెలుస్తోంది. మోర్బీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటును నిరాకరించింది. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ, మాజీ ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ సహా పలువురు సీనియర్లు ఈసారి పోటీకి దూరంగా ఉంటామని అధిష్ఠానానికి లేఖ రాసినట్లు భాజపా తెలిపింది.

gujarat elections 2022
మోదీతో రవీంద్ర జడేజా భార్య

మోర్బీ నుంచి కాంతీలాల్​ అమృతియా.. ఆ సాహసానికి ప్రశంసిస్తూ..
గుజరాత్​ ఎన్నికల్లో మోర్బీ నుంచి అసెంబ్లీ స్థానం అక్కడి మాజీ ఎమ్మెల్యే కాంతిలాల్ అమృతియాకు దక్కింది. మోర్బీ ఘటన సమయంలో నదిలోకి దూకి మరి కాంతీలాల్​ ప్రజలను కాపాడినందుకుగానూ ఆయన కృషికి ప్రశంసించి ఈ టిక్కెట ఆయనకు ఇస్తున్నట్లు భాజపా వెల్లడించింది. అయితే అదే స్థానానికి పోటీ చేయాలనుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రిజేష్ మెర్జాకు నిరాశే మిగిలింది.

gujarat elections 2022
మోర్బీ బాధితులను కాపాడిన కాంతీలాల్​ అమృతియా

182 స్థానాలు గల గుజరాత్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 1న 89 స్థానాలకు.. డిసెంబర్ 5న మిగతా స్థానాల్లో పోలింగ్ జరగనుంది.

ఇదీ చదవండి:CAA Citizenship : ఆ రాష్ట్రాల్లో పౌరసత్వమిచ్చే అధికారం కలెక్టర్లకు!

బిజినెస్​లోనూ ధోనీ నెం.1.. బిగ్గెస్ట్​ ట్యాక్స్​ పేయర్​గా ఘనత!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.