గుజరాత్‌లోని ద్వారకలో రూ.88.25 కోట్లు విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేశారు పోలీసులు. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి ఈ 17.65 కిలోల హెరాయిన్, మెథంఫిటామిన్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పాకిస్థాన్ నుంచి ఈ డ్రగ్స్‌ను తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం..
డ్రగ్స్ పంపిణీ అవుతున్నాయన్న సమాచారం అందుకున్న పోలీసులు.. మహారాష్ట్ర నుంచి వచ్చిన సజ్జాద్ ఘౌసీ అనే వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేశారు. సజ్జాద్ ఇచ్చిన సమాచారం మేరకు ద్వారక జిల్లాలోని సలయాకు చెందిన మరో ఇద్దరిని బుధవారం అరెస్ట్ చేశారు. కారా బ్రదర్స్‌గా పేర్కొంటున్న వీరు పాక్ నుంచి సముద్రమార్గాన అక్రమంగా వచ్చిన డ్రగ్స్‌ను సజ్జాద్కు పంపిణీ చేయాల్సి ఉంది.
నిందితుల నుంచి 11.483 కిలోల హెరాయిన్, 6.168 కిలోల మెథంఫిటామిన్లను స్వాధీనం చేసుకున్నారు.
కారా బ్రదర్స్ ఇంట్లో సోదాలు నిర్వహించగా ఇటువంటివే మరో 47 ప్యాకెట్లు దొరికాయని అధికారులు వెల్లడించారు. అయితే ఇవేంటో తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
అరెస్ట్ అయిన నిందితుల్లో ఘౌసీ ఇదివరకే ఓ మర్డర్ కేసుపైన జైలు శిక్ష అనుభవించాడని, మరో నిందితుడు సలీమ్ కారా కూడా నకిలీ నోట్ల ముద్రణ కేసులో అరెస్ట్ అయ్యాడని పోలీసులు వెల్లడించారు.