ETV Bharat / bharat

Ramoji film city: రామోజీ ఫిల్మ్​సిటీలో రంగుల వినోదాలు ప్రారంభం - రామోజీ చిత్ర నగరి

ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్​సిటీలో(Ramoji film city) మధురానుభూతులు మళ్లీ మొదలయ్యాయి. కరోనా(Corona virus) విరామం అనంతరం తొలిరోజు మైమరిపించే కార్యక్రమాలతో చిత్రనగరి స్వాగతం పలికింది(Ramoji film city Reopen ). సుందర కట్టడాలు, అద్భుత దృశ్యాల మధ్య నిర్వహించిన స్వాగత వేడుక సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేసింది. కొవిడ్ప్రత్యేక మార్గదర్శకాలను అమలుచేస్తూ.. పర్యాటకుల భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.

Ramoji film city
రామోజీ ఫిల్మ్​సిటీలో రంగుల వినోదాలు ప్రారంభం
author img

By

Published : Oct 8, 2021, 5:16 PM IST

Updated : Oct 8, 2021, 8:25 PM IST

రామోజీ ఫిల్మ్​సిటీలో రంగుల వినోదాలు ప్రారంభం

ప్రపంచంలోనే అతి పెద్ద చిత్రనగరిగా(Ramoji film city Reopen) గిన్నిస్​ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన రామోజీ ఫిల్మ్ సిటీలో(ramoji film city latest news) రంగుల వినోదాలు ప్రారంభమయ్యాయి. కరోనా(Corona virus) పరిస్థితుల తర్వాత సకుటుంబ సమేతంగా ఆనందంగా గడిపేందుకు అవకాశం కల్పిస్తోంది. ఫిల్మ్​ సిటీ(ramoji film city) తెరుచుకున్న తొలిరోజే వేలాది మంది తరలివచ్చి కేరింతలు కొట్టారు. చిత్రనగరిలో అడుగుపెట్టిన వారి కోసం నిర్వహించిన స్వాగత వేడుక పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేసింది.

Ramoji film city
చిత్రనగరిలో అద్భుత ప్రపంచం

అదిరే కొరియాగ్రఫీతో లైవ్ డాన్స్​లు, 'యాక్షన్ ప్యాక్డ్ వైల్డ్ వెస్ట్ స్టంట్ షో'లతో కళాకారులు వారెవా అనిపించారు. ఆన్ స్టేజ్ లైవ్ పెర్ఫామెన్స్​కు యానిమేషన్ కలిపి చేసే బ్లాక్ లైట్ షో మరో హైలైట్​గా నిలిచాయి. ఫిల్మ్​ సిటీలోని ఎక్స్​క్లూజీవ్​ జోన్లు పిల్లలను విశేషంగా అలరిస్తున్నాయి. భారీ సైజులో ఉండే బోర్డుపై స్నేక్స్ అండ్ లాడర్ గేమ్ ఆడటం సరికొత్త అనుభూతినిస్తుంది. పచ్చని పందిరి కింద ఉన్న బర్డ్ పార్క్ వివిధ ఖండాలకు చెందిన పక్షులు.. అన్యదేశ జాతులు, రంగులు కలిగిన అద్భుతమైన బటర్ ఫ్లై పార్కును సందర్శించి పర్యాటకులు మైమర్చిపోతున్నారు.

Ramoji film city
చిన్నారుల కేరింతలు

వింటేజ్ బస్సుల్లో ప్రయాణిస్తూ రోజంతా అద్భుత ఫాంటసీ ప్రపంచాన్ని ఆస్వాదిస్తున్నారు. సినిమా సెట్టింగ్​లు, సుందరమైన ఉద్యానవనాలు, మనసును ఆహ్లాదపరిచే లొకేషన్లను వీక్షిస్తూ.. మైమర్చిపోతున్నారు. రాజుల కాలాన్ని తలపించే కోటలు, మొగలుల వైభవం, మౌర్యులు శౌర్యాన్ని ప్రతిబింబించే నిర్మాణాలకు మంత్రముగ్ధులవుతున్నారు.

Ramoji film city
లైవ్ డాన్స్​లు
Ramoji film city
కిడ్స్​ పార్క్​లో చిన్నారుల కేరింతలు

చలనచిత్ర చరిత్రలో అద్భుత రికార్డులు సృష్టించిన బాహుబలి(bahubali set design) అనుభూతిని ప్రత్యక్షంగా పొందే అవకాశం రామోజీ ఫిల్మ్​ సిటీ సందర్శనతో పొందుతున్నారు. మాహిష్మతీ సామ్రాజ్యంలోని సుందర రాజప్రసాదాలు, అద్భుత ఆలయాల మధ్య సరదాగా విహరిస్తున్నారు.

Ramoji film city
ఫిల్మ్​ సిటీలో సందర్శకుల సందడి
Ramoji film city
మాయా ప్రపంచంలో విహారం
RFC TOURISIUM
స్వాగత వేడుకలను తిలకిస్తున్న పర్యాటకులు

ఇదీ చూడండి: రామోజీ ఫిల్మ్​సిటీలో చిత్రీకరణలు పునఃప్రారంభం

Last Updated : Oct 8, 2021, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.