మహారాష్ట్ర పుణెలో ఆడపిల్ల పుట్టిందని ఉప్పొంగిపోయిన ఓ కుటుంబ సభ్యులు పసిపాపను ఇంటికి తీసుకువచ్చేప్పుడు ఘనంగా ఆహ్వానం పలికారు. ఆస్పత్రి నుంచి ఇంటివరకు హెలికాప్టర్లో తీసుకువచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ చిన్నారి పేరు రాజ్యలక్ష్మి. జనవరి 22న భొసారి పట్టణంలో జన్మించింది. ఆమె తండ్రి విశాల్ జరేకర్(30) ' చాలాకాలం తర్వాత మాకు ఆడబిడ్డ కలిగింది. చిన్నారి పుట్టడంపై చాలా ఆనందంగా ఉన్నాం. ఆస్పత్రి నుంచి ఇంటివరకు హెలికాప్టర్‌పై వచ్చాం.' అయితే.. హెలికాప్టర్ స్థానికంగా తమ వ్యవసాయ క్షేత్రంలో లాండింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపాడు.
ఇదీ చదవండి: బ్రిడ్జిపైనుంచి దూకిన పేషెంట్.. పోలీసులు ఎలా కాపాడారంటే..?