ETV Bharat / bharat

'లఖింపుర్​ హింసపై రిటైర్డ్​ జడ్జితో విచారణ- వారికి రూ.45లక్షలు పరిహారం'

లఖింపుర్​ ఖేరి(Lakhimpur Kheri news) హింసాత్మక ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించనున్నట్లు తెలిపారు ఏడీజీ ప్రశాంత్​ కుమార్​. ప్రాణాలు కోల్పోయిన(Lakhimpur Kheri violence) నలుగురు రైతులకు రూ.45 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. జిల్లాలో పర్యటించేందుకు రాజకీయ నేతలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మరోవైపు.. హింసలో మరణించిన భాజపా కార్యకర్తల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర డిమాండ్ చేశారు.

author img

By

Published : Oct 4, 2021, 1:30 PM IST

Lakhimpur Kheri
లఖింపుర్​ ఖేరి హింసాత్మక ఘటన

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరిలో(Lakhimpur Kheri violence) ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలో(Lakhimpur Kheri violence) ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు రూ.45 లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు ఏడీజీ(శాంతిభద్రతలు) ప్రశాంత్​ కుమార్​. గాయపడిన వారికి రూ.10 లక్షలు అందిస్తామని చెప్పారు.

హింసాత్మక ఘటనలపై రైతుల ఫిర్యాదు మేరకు ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్లు చెప్పారు ప్రశాంత్​ కుమార్​. హింసపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించనున్నట్లు తెలిపారు.

రాజకీయ నేతలకు అనుమతి లేదు..

రైతుల నిరసనల్లో హింసాత్మక ఘటనలు(Lakhimpur Kheri violence) చెలరేగిన క్రమంలో జిల్లాలో 144 సెక్షన్​ అమలు చేసినట్లు చెప్పారు ఏడీజీ ప్రశాంత్​ కుమార్​. జిల్లాలో పర్యటించేందుకు రాజకీయ నేతలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అయితే.. రైతు సంఘాల నేతలు వచ్చేందుకు అనుమతిస్తున్నట్లు చెప్పారు.

'వారికీ పరిహారం ఇవ్వండి'

ఆదివారం జరిగిన హింసలో మరణించిన భాజపా కార్యకర్తల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర డిమాండ్ చేశారు. ఘటనపై సీబీఐ, సిట్ లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలన్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మిశ్ర పేర్కొన్నారు. భాజపా కార్యకర్తలపై కర్రలు, కత్తులతో దాడి చేశారని ఆరోపించారు. అక్కడే ఉన్నట్లేతే.. తాను కూడా మరణించేవాడినని అన్నారు.

ఇదీ జరిగింది..

యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో లఖింపుర్​ ఖేరీలో(Lakhimpur Kheri violence) హింస చెలరేగింది. టికునియా-బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు. నిరసన చేస్తున్న అన్నదాతలపైకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్ర కారుతో పాటు మరో వాహనం దూసుకెళ్లడం వల్లే రైతులు మరణించినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: లఖింపుర్ హింసపై విపక్షాలు ఫైర్- కేంద్ర మంత్రి కుమారుడిపై కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.