ETV Bharat / bharat

'కొత్త భవనంలోనే వచ్చే ఏడాది శీతాకాల సమావేశాలు' - పార్లమెంటు నూతన భవనం

పార్లమెంటు నూతన భవనం, సెంట్రల్​ విస్టా పనుల్ని వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. 2022 డిసెంబరులో శీతాకాల సమావేశాలను పార్లమెంటు నూతన భవనంలోనే నిర్వహించాలని భావిస్తోందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

central vitsta
నూతన పార్లమెంటు భవనం
author img

By

Published : May 17, 2021, 7:03 AM IST

పార్లమెంటు నూతన భవనం నిర్మాణం, సెంట్రల్​ విస్టా పనులను పక్కన పెట్టాలని కాంగ్రెస్​ సహా విపక్షాలు డిమాండ్​ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం అడుగు ముందుకు వేసేందుకే మొగ్గు చూపిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టుల పనుల్ని వేగవంతం చేసి, 2022 డిసెంబరులో శీతాకాల సమావేశాలను కొత్త భవనంలోనే నిర్వహించాలని భావిస్తోంది. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ కవాతును కూడా.. పూర్తిగా మెరుగులు దిద్దిన సెంట్రల్​ విస్టా ప్రాంతంలో జరపాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

"రెండు ప్రాజెక్టులకు టెండర్లను కరోనా ఉద్ధృతి కంటే ముందే ఖరారు చేశాం. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కచ్చితంగా పాటిస్తూ దాదాపు 400 మంది కార్మికులు రెండుచోట్ల పనిచేస్తున్నారు. పెంచిన గడువులోగా మొత్తం ప్రాజెక్టు పనులు పూర్తి కావాల్సి ఉన్నందువల్ల సెంట్రల్​ విస్టాలో మిగిలిన పనులను తర్వాత చేపడతాం."

- ఉన్నతాధికారి

ఈ పనులను నిలిపివేసి, ఆ ఖర్చుతో దేశంలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్​ వేయాలన్న కాంగ్రెస్​ డిమాండ్​ సరైనది కాదని మరో అధికారి చెప్పారు. కేంద్ర సచివాలయం, ప్రధాని నివాసం, ఉప రాష్ట్రపతి నివాసం సహా మొత్తం 13 భవనాలకు రమారమి రూ.17,000కోట్లు ఖర్చవుతుందని అంచనా. 2026 నాటికి వీటిని పూర్తి చేయాల్సి ఉంది. కరోనా టీకాల కోసం ఇంతకు రెట్టింపు మొత్తం కంటే ఎక్కువే కేటాయించామని కేంద్ర మంత్రి హర్​దీప్​సింగ్ ​పురి ఇటీవల చెప్పారు.

ఇదీ చూడండి: 'దురుద్దేశంతోనే సెంట్రల్​ విస్టాపై పిటిషన్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.