ETV Bharat / bharat

'సీఎం వల్లే నేను బంగారం స్మగ్లింగ్​ చేయాల్సి వచ్చింది' - గోల్డ్​ స్మగ్లింగ్ కేసు

Swapna Suresh 164 Statement: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ కారణంగా తాను బంగారం స్మగ్లింగ్​లో ఇరుక్కున్నట్లు నిందితురాలు స్వప్న సురేశ్​ వెల్లడించారు. 2016లో సీఎం దుబాయ్​ పర్యటన సందర్భంగా జరిగిన ఘటన తర్వాతే బంగారం స్మగ్లింగ్​ చేయాల్సి వచ్చిందన్నారు.

స్మప్న సురేశ్
స్మప్న సురేశ్
author img

By

Published : Jun 7, 2022, 7:12 PM IST

Gold Smuggling Case Kerala: బంగారం స్మగ్లింగ్​ కేసు నిందితురాలు స్వప్న సురేశ్​ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్,​ ఆయన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వల్లే తాను ఈ స్మగ్లింగ్​ చేయాల్సి వచ్చినట్లు పేర్కొన్నారు. మంగళవారం ఎర్నాకుళంలోని కోర్టుకు హాజరైన ఆమె.. ఈ కేసుకు సంబంధించి పలు ఆధారాలను సమర్పించారు. అయితే ఆ వివరాలను గోప్యంగా ఉంచారు.

"2016లో సీఎం దుబాయ్​ పర్యటన సందర్భంగా మాజీ ప్రిన్సిపల్​ సెక్రటరీ ఎం శివశంకర్​ నన్ను సంప్రదించారు. సీఎం త్రివేండ్రంలో బ్యాగ్​ మర్చిపోయారని దానిని వీలైనంత త్వరగా దుబాయ్​ చేర్చాలని చెప్పారు. ఈ క్రమంలో దుబాయ్​ కాన్సులేట్​లోని ఓ దౌత్య అధికారికి ఆ బ్యాగ్​ను ఇచ్చాను. కానీ అక్కడ స్కానింగ్​లో బ్యాగ్​ నిండా డబ్బు ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన తర్వాతే నేను ఈ బంగారం స్మగ్లింగ్​లో భాగం కావాల్సి వచ్చింది. అంతేకాదు.. దుబాయ్​ కాన్సులేట్​ నుంచి సీఎం నివాసానికి ఓ బిర్యానీ చేసే పాత్రలో విలువైన లోహాలను తరలించారు."

-స్వప్న సురేశ్, నిందితురాలు

ఈ విషయాన్ని వెల్లడించడం వెనుక తనకు మరో ఉద్దేశం లేదని స్వప్న అన్నారు. తన ప్రాణానికి ముప్పు ఉన్న కారణంగా ఈ వివరాలను గోప్యంగా కోర్టుకు వివరించినట్లు తెలిపారు. మీడియా ఈ కేసును దర్యాప్తు చేసి నిజాలను బయటపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో సీఎం, ఆయన కుటుంబసభ్యులు సహా ఎం శివశంకర్, మంత్రి కేటీ జలీల్​, ప్రైవేట్​ సెక్రటరీ సీఎం రవీంద్రన్​ కూడా భాగమయ్యారని ఆరోపించారు స్వప్న.

ఇదీ చూడండి : ఫ్రాడ్​ కేసులో క్రికెటర్​ తండ్రి అరెస్టు.. రూ.1.25 కోట్లు స్వాహా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.