ETV Bharat / bharat

ప్రపంచ బ్యాంకుకు సలహాదారుడిగా 'మహో'పాధ్యాయుడు!

గతేడాది ప్రతిష్టాత్మక 'గ్లోబల్​ టీచర్​ ప్రైజ్​ మనీ' పురస్కారాన్ని అందుకున్నమహారాష్ట్ర ఉపాధ్యాయుడు రంజిత్​ సింగ్​ డిసలేకు మరో సమున్నత గౌరవం దక్కింది. ఉపాధ్యాయుల శిక్షణలో నాణ్యతను పెంచేందుకు ప్రపంచ బ్యాంకు ఏర్పాటు చేసిన ఓ కమిటీలో సభ్యుడిగా ఆయన ఎంపికయ్యారు. 2024 జూన్​ వరకు ఇందులో సభ్యుడిగా డిసలే కొనసాగనున్నారు.

Global Teacher'
గ్లోబల్​ టీచర్​, రంజిత్​ సింగ్​ డిసలే
author img

By

Published : Jun 3, 2021, 7:02 PM IST

మహారాష్ట్రకు చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్​సింగ్ డిసలేకు మరో అరుదైన గౌరవం దక్కింది. గతేడాది 'గ్లోబల్ టీచర్స్​ ప్రైజ్​మనీ-2020' అందుకున్న ఆయన.. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు సలహా కమిటీలో సభ్యుడిగా ఎంపికయ్యారు. 2021 జూన్​ నుంచి 2024 జూన్​ వరకు ఆయన ఈ కమిటీలో సభ్యుడిగా ఉండనున్నారు.

అసలేంటీ కమిటీ?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు శిక్షణలో నాణ్యతను పెంచేందుకు 'గ్లోబల్​ కోచ్​' పేరుతో ప్రపంచ బ్యాంకు ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి 12 మందిని ఎంపిక చేసి సలహాదారుల కమిటీని ఏర్పాటు చేసింది.

సాంకేతికత సాయంతో శిక్షణ కార్యక్రమాల ద్వారా 21వ శతాబ్దపు ఉపాధ్యాయులను తయారు చేసేందుకు ఈ కమిటీ కృషి చేస్తుందని రంజిత్​ సింగ్​ డిసలే చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లల విద్యా స్థాయులను పెంచటం సహా... ఉపాధ్యాయుల నైపుణ్యాలను పెంచేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

క్రెగ్​.ఓఆర్​జీ సహకారంతో 'వర్కీ ఫౌండేషన్​' అనే సంస్థ గ్లోబల్​ స్టూడెంట్ ప్రైజ్​ కార్యక్రమాన్ని ప్రారంభించింది. విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే వారిని ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో దీన్ని తలపెట్టింది. 'గ్లోబల్ స్టూడెంట్​ ప్రైజ్'​ అకాడమీలోనూ డిసలే.. సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ కమిటీలో.. అశ్తోన్​ కుచర్​, మాలియా కునిస్​, అమెరికా క్రీడాకారిణి జూలీ ఎర్ట్జ్​, ఆమె భర్త జాక్​ ఎర్ట్జ్​ సభ్యులుగా ఉన్నారు.

ఇదీ చూడండి: ఆయుష్షు పెంచే ఆరోగ్య సాధనం 'సైకిల్'

ఇదీ చూడండి: Cycle Day: అగ్గిపుల్లలతో అద్భుత కళారూపం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.