ETV Bharat / bharat

హిమగిరుల్లో అద్దాల ఇగ్లూలు.. వెచ్చటి సౌధం నుంచి చల్లటి అందాలు ఆస్వాదించేలా.. - glass igloo tourist places

చుట్టూ మంచు.. భారీగా హిమపాతం.. వెచ్చటి అద్దాల గదిలో కూర్చొని ఆ అందాలను ఆస్వాదించడం.. చదువుతుంటే ఏదో ఫాంటసీలా అనిపిస్తోంది కదూ! కానీ ఈ అనుభూతిని నిజంగా పంచుతోంది జమ్ము కశ్మీర్​లోని ఓ రెస్టారెంట్. అద్దాలతో ఇగ్లూలను ఏర్పాటు చేసి పర్యటకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది.

Glass Igloo restaurant at Gulmarg
Glass Igloo restaurant at Gulmarg
author img

By

Published : Jan 28, 2023, 8:29 PM IST

అద్దాల ఇగ్లూ రెస్టారెంట్

పర్యటకులకు స్వర్గధామం జమ్ము కశ్మీర్. మంచు అందాలు పెనవేసుకొని ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షించే ప్రాంతమిది. కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల ఇటీవల ఇక్కడికి వచ్చే పర్యటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరిని ఆకట్టుకునేందుకు స్థానిక హోటళ్లు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ కోవలోనే ఓ హోటల్.. అద్దాలతో చేసిన ఇగ్లూలను ఏర్పాటు చేసింది.

Glass Igloo restaurant at Gulmarg
అద్దాల ఇగ్లూలు

గుల్మార్గ్​లో ఉన్న కొలహోయి గ్రీన్ హైట్స్ అనే ప్రముఖ హోటల్.. ఈ వినూత్న అద్దాల ఇగ్లూలను నెలకొల్పింది. గతంలో మంచుతో ఇగ్లూలను నిర్మించి పర్యటకులను ఆకట్టుకున్న ఈ హోటల్.. తాజాగా అద్దాల లోపలి నుంచి మంచు అందాలు ఆస్వాదించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చైనా నుంచి దిగుమతి చేసుకొని అద్దాల ఇగ్లూలను నిర్మించినట్లు ఈ హోటల్ మేనేజర్ హమీద్ మసూది చెబుతున్నారు. ఫ్యాబ్రికేటెడ్ గ్లాస్​తో ఇగ్లూ రెస్టారెంట్ ప్రారంభించడం భారత్​లో ఇదే తొలిసారని చెబుతున్నారు.

Glass Igloo restaurant at Gulmarg
అద్దాల ఇగ్లూలు

"గతేడాది రెండుసార్లు మంచు ఇగ్లూలు తయారు చేశాం. గుల్మర్గ్​లోనే కాదు, కశ్మీర్​లోనే అది తొలి మంచు ఇగ్లూ. ఆసియాలోనే అతిపెద్ద ఇగ్లూలను రూపొందించాం. ఆ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద మంచు ఇగ్లూలు నిర్మించాం. ఈ సారి కొత్తగా ఏదైనా ప్రయత్నిద్దామని అనుకున్నాం. ఫిన్లాండ్​కు చెందిన కాన్సెప్ట్ ఇది. ఫిన్లాండ్​లో అద్దాల ఇగ్లూలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. టూరిస్టులకు కొత్త అనుభూతిని పరిచయం చేయాలని అనుకున్నాం. మంచు కోసమే అందరూ ఇక్కడికి వస్తారు. ఈ అద్దాల ఇగ్లూలో కూర్చొని ఆహారం తింటూ హిమపాతాన్ని ఆస్వాదించవచ్చు. వారికి ఇదో కొత్త అనుభూతిలా ఉంటుంది. ఇగ్లూ లోపల హీటింగ్ అన్ని ఏర్పాట్లు చేశాం. అతిథులకు అసలు చలి అనిపించదు. బర్త్​డేలు, వార్షికోత్సవాలు జరుపుకొనేందుకు చాలా మంది ఇక్కడికి వస్తారు. గరిష్ఠంగా ఇందులో ఎనిమిది మంది కూర్చోవచ్చు."
-హమీద్ మసూది, హోటల్ మేనేజర్

టూరిస్టులు ఖుష్..
ఈ అద్దాల ఇగ్లూలకు పర్యటకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. బయట ఎంత చలిగా ఉన్నప్పటికీ.. లోపల వెచ్చగా ఉంటూ మంచును ఆస్వాదిస్తున్నామని టూరిస్టులు చెబుతున్నారు. ఈ అద్దాల ఇగ్లూ.. ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతిని ఇస్తోందని మురిసిపోతున్నారు.

Glass Igloo restaurant at Gulmarg
అద్దాల ఇగ్లూలు

"చాలా మంచి అనుభూతి. లోపల వెచ్చగా ఉంది. బయట ఎంతో చల్లగా ఉంది కానీ.. లోపల హీటర్లు ఉన్నాయి కాబట్టి ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. చూడటానికి చుట్టూ మంచు ఉంది. కానీ లోపల ఉష్ణోగ్రత అంతగా అనిపించడం లేదు. గుల్మార్గ్​కు వెళ్తే ఈ ప్రాంతానికి రావాలని అనుకున్నా. అందుకే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చా. నా స్నేహితులు స్కీయింగ్ చేస్తున్నారు. ఏకాంతంగా ఉండటం సహా.. ఇతర ప్రాంతాల్లో అందుబాటులో లేని ఈ ఇగ్లూను అనుభూతి చెందాలని నేనిక్కడికి వచ్చాను."
-పునీత అగర్వాల్, టూరిస్ట్, దిల్లీ

ఇక ఈ అద్దాల ఇగ్లూలో గడపడానికి 40 నిమిషాలకు రెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. గరిష్ఠంగా 50 నిమిషాల వరకు ఇందులో ఉండేందుకు అనుమతిస్తామని హోటల్ మేనేజర్ చెబుతున్నారు. పర్యటకులు ఆర్డర్ ఇచ్చే ఆహారానికి.. బిల్లు వేరుగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. వచ్చే ఏడాదికి సైతం ఏదైనా స్పెషల్ కాన్సెప్ట్​తో ముందుకొస్తామని చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.