Youngman Suicide: మధ్యప్రదేశ్లో ఇందోర్లోని బంగంగా ప్రాంతంలో ఓ యువకుడు తన ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారణ జరపగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. దీంతో ఇద్దరు అనుమానితులపై కేసు నమోదు చేశారు పోలీసులు.
పోలీసుల వివరాల ప్రకారం.. సుఖ్లియా ప్రాంతంలో సాగర్ కుష్వాహ అనే యువకుడు ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఓ మహిళ తన భర్తను వదిలి సాగర్ దగ్గరకు వచ్చింది. అతడితో కలిసి 22 రోజులపాటు సహజీవనం చేసింది. ఆ తర్వాత తన భర్త దగ్గరకు తిరిగి వెళ్లిపోయింది. అయితే ఇదే విషయాన్ని అదనుగా తీసుకున్న ఆమె భర్త బబ్లూ.. సాగర్ను వేధించడం ప్రారంభించాడు. ఐదు లక్షలు రూపాయలు ఇవ్వకపోతే అత్యాచారం కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తానని బెదిరించాడు. బబ్లూ మరదలు కిరణ్ నిహారే కూడా సాగర్ను మానసికంగా వేధించింది. దీంతో వాటిని భరించలేక అతడు ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాగర్ కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించారని బబ్లూతోపాటు అతడి మరదలుపై కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: సింగర్ హత్యతో దిగొచ్చిన పంజాబ్ సర్కార్.. వారికి భద్రత పునరుద్ధరణ!