ETV Bharat / bharat

బర్త్​డేకు సెల్​ఫోన్​ కొనలేదని బాలిక ఆత్మహత్య - రాజస్థాన్​ బాలిక ఆత్మహత్య

Girl Suicide In Rajasthan: బర్త్​డేకు సెల్​ఫోన్ కొనలేదని.. మనస్తాపంతో ఓ బాలిక ఆత్మహత్య​ చేసుకుంది. ఈ విషాద ఘటన రాజస్థాన్​లో జరిగింది.

girl suicide in rajasthan
బర్త్​డేకు సెల్​ఫోన్​ కొనలేదని బాలిక సూసైడ్
author img

By

Published : Feb 19, 2022, 7:41 AM IST

Girl Suicide In Rajasthan: సెల్​ఫోన్ ఉచ్చులో పడి చాలా మంది యువత నిండు జీవితాల్ని బలితీసుకుంటున్నారు. మరికొంతమంది ఫోన్​ వాడకానికి బానిసై మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి విషాదకరమైన ఘటనే రాజస్థాన్​ జైపుర్​లోని సోద్లాలో జరిగింది. బర్త్​డేకు కొత్త మొబైల్​ఫోన్​ కొనకపోవడం వల్ల.. మనస్తాపంతో ఓ బాలిక(18) ఆత్మహత్య చేసుకుంది.

బాలిక 12వ తరగతి చదువుతోంది. ఫిబ్రవరి 13న ఆమె పుట్టినరోజు కాగా పబ్​జీ ఆడుకునేందుకు కొత్త సెల్ కావాలని తల్లిదండ్రులకు చెప్పింది. పరీక్షలు అయిపోయాక కొనిస్తానని బాలిక తండ్రి చెప్పాడు. అయితే సెల్ కొనలేదన్న మనస్తాపంతో ఇంట్లోనే ఉరివేసుకుంది.

ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని జైపుర్ ఎస్పీ రాజ్​కుమార్ గుప్తా తెలిపారు.

ఇదీ చూడండి: Girl Raped in Train: రన్నింగ్​ ట్రైన్​లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.