ETV Bharat / bharat

బాత్​రూంలో బంధించి యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం - దిల్లీ వార్తలు

దిల్లీలో ఓ యువతిని బాత్​రూంలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. ఆమె స్నానం చేసేందుకు వెళ్తుండగా చొరబడి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులిద్దరూ బాధితురాలి ఇంట్లోనే అద్దెకు ఉంటున్నారు.

A Girl raped by two boys
బాత్​రూంలో బంధించి యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం
author img

By

Published : Oct 13, 2021, 1:43 PM IST

దిల్లీ చంద్రవిహార్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్నానం చేసేందుకు బాత్​రూంలోకి వెళ్తుండగా బలవంతంగా లోనికి ప్రవేశించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితురాలిని బంధించి, నోరు మూసి క్రూరంగా ప్రవర్తించారు. నిందితులిద్దరూ బాధితురాలి ఇంట్లోనే అద్దెకు ఉంటున్నారు.

ఘటన అనంతరం యువతిని వారిద్దరూ బెదిరించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని భయపెట్టి, అక్కడి నుంచి పరారయ్యారు. విషయాన్ని బాధితురాలు కుటుంబసభ్యులకు చెప్పింది. వెంటనే వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అధికారులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు మరో నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

మైనర్​పై ఫ్యామిలీ ఫ్రెండ్ అత్యాచారం..

సెంట్రల్ దిల్లీ పహాడ్​గంజ్​లో వెలుగు చూసిన మరో ఘటనలో 14ఏళ్ల బాలికపై ఫ్యామిలీ ఫ్రెండే అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారిని టిఫిన్ చేద్దాం అని చెప్పి హోటల్​కు తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం బాధితురాలిని మార్కెట్​లో విడిచిపెట్టాడు. ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరించాడు.

తొమ్మిదో తరగతి చదువుతున్న బాధితురాలు.. ఇంటికి చేరుకున్నాక జరిగిన విషయం తల్లికి చెప్పింది. వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించింది. సీసీ కెమెరాల్లో నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు.

నిందితుడు బాధితురాలి తల్లికి తెలిసిన వ్యక్తే అని పోలీసులు చెప్పారు. ఆమె అనారోగ్యంతో ఉండటం వల్ల స్కూల్​ యూనిఫాం ఇప్పించేందుకు కమార్తెను అతనితో పంపించిందని, కానీ అతడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపారు. హోటల్​కు తీసుకెళ్లాక బాలిక భయంతో బయటకు పరిగెత్తేందుకు ప్రయత్నించగా అతడు ఆమెను లాక్కెళ్లినట్లు వివరించారు.

పుణెలో జరిగిన మరో దారుణ ఘటనలో కబడ్డీ ఆడుతున్న బాలికను ఇద్దరు యువకులు లాక్కెళ్లి హత్య చేశారు. ఈ వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదీ చదవండి: పాముతో భార్యను చంపిన భర్తకు రెండు జీవిత ఖైదులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.