Girl Fell Into Borewell: ఇంటి బయట ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తు 200 అడుగుల బోరుబావిలో రెండేళ్ల బాలిక పడిపోయింది. ఈ ఘటన రాజస్థాన్ దౌసా జస్సాపడ గ్రామంలో గురువారం జరిగింది. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలియడం వల్ల.. వారు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అధికారులు ఘటనా స్థలానికి జేసీబీ యంత్రాలు, ట్రాక్టర్లను పంపించి సహాయక చర్యలు చేపట్టారు. 7 గంటలకుపైగా శ్రమించి అధికారులు ఆమెను బయటకు తీశారు.

సుమారు 60 అడుగులో లోతులో బాలిక చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. బోరుబావి చుట్టూ ఉన్న మట్టిని జేసీబీలతో తవ్వి.. సీసీ కెమెరాల ద్వారా బాలిక కదలికలను గమనించారు. బాధితురాలికి పైపుల ద్వారా ఆక్సిజన్‌ను సరఫరా చేశారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కలిసి.. 7 గంటల తర్వాత బాలికను సురక్షితంగా బయటకు తీశారు. ఘటనా స్థలంలో భారీగా జనం గుమిగూడారు.
ఇవీ చదవండి: కరెంట్ కోతలకు ముగ్గురు రోగులు మృతి.. కమిటీ వేసిన సర్కార్!
ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తాం: నీతీశ్