ETV Bharat / bharat

దారుణం.. ఒకే కుటుంబంలో నలుగురిని ఉరి తీసిన నక్సలైట్లు - మావోయిస్టుల వార్తలు

బిహార్​లో నక్సలైట్లు దారుణానికి పాల్పడ్డారు(naxalite attack in gaya). ఓకే కుటుంబానికి చెందిన నలుగురిని వారి ఇంటి బయటే ఉరి తీశారు. వీరు ఇన్ఫార్మర్లుగా పనిచేయడం వల్ల గతేడాది నలుగురు మవోయిస్టులు మరణించారని, అందకు ప్రతీకారంగా ఈ చర్యకు పాల్పడినట్లు గోడపై పోస్టర్ అంటించారు(gaya naxal attack).

Gaya: Naxals hanged four members of the same family

author img

By

Published : Nov 14, 2021, 1:19 PM IST

Updated : Nov 14, 2021, 2:28 PM IST

బిహార్​ గయాలోని మొన్​బార్ గ్రామంలో ఓకే కుటుంబానికి చెందిన నలుగురిని ఉరి తీశారు నక్సలైట్లు(naxalite attack in gaya). వారి ఇంటిని బాంబుతో పేల్చారు. మరణించిన వారు ఇద్దరు అన్నదమ్ములు, వారి భార్యలుగా తెలుస్తోంది. ఈ కుటుంబం ఇన్ఫార్మర్లుగా వ్యవహరించినందు వల్ల గతంలో జరిగిన ఓ ఎన్​కౌంటర్​లో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారని, అందుకు ప్రతీకారంగానే ఇప్పుడు ఈ చర్యకు పాల్పడినట్లు నక్సలైట్లు పోస్టర్​ అంటించారు(gaya naxal attack). గ్రామంలో ఎవరైనా తమకు నమ్మక ద్రోహం చేస్తే వారికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.

ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందగానే పోలీసులు, సీఆర్​పీఎఫ్ సిబ్బంది హూటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్​ఎస్​పీ ఆదిత్య కుమార్​, ఎస్పీ రాకేశ్​ కుమార్​ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పదుల సంఖ్యలో సిబ్బందితో గ్రామంలో పహారా కాస్తున్నారు.

దాదాపు 25 మంది నక్సలైట్లు సమూహంగా వచ్చి ఈ నలుగురిని ఉరి తీసినట్లు గ్రామంలోని ప్రత్యక్ష సాక్షి తెలిపారు(gaya news). గతంలోనూ మార్చ్​గా వచ్చి బెదిరించినట్లు వెల్లడించారు. నక్సలైట్ల చర్యతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

గతేడాది ఏం జరిగింది?

గతేడాది మొన్​బార్ గ్రామంలో సర్జు సింగ్ భోక్తా అనే వ్యక్తి ఇంటి వద్ద ఎన్​కౌంటర్ జరిగింది(bihar gaya naxal news). పోలీసులు ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరి శవం సర్జు ఇంటి ఎదుటే కనిపించగా.. మిగతా ముగ్గురి మృతదేహాలు ఆ పరిసర ప్రాంతాల్లో పడి ఉన్నాయి. వీరి నుంచి భారీగా ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు(naxal attack in bihar). అయితే ఇది ఎన్​కౌంటర్​ కాదని సీపీఐ మవోయిస్టు నక్సలైట్లు ఆరోపించారు. సర్జు సింగ్​ భోక్తా ఇంటికి వెళ్లిన నలుగురు మావోయిస్టులకు ఆహారంలో విషం కలిపి పెట్టారని, ఆ తర్వాత పోలీసులకు సమాచారమిచ్చారని చెప్పారు. అనంతరం పోలీసులు.. స్పృహలో లేని నలుగురిని కాల్చి చంపి ఎన్​కౌంటర్​గా నమ్మించారని పేర్కొన్నారు.

ఈ ఘటనకు ప్రతీకారంగానే తాము సర్జు సింగ్ భోక్తా ఇంటిపై దాడి చేశామని కరపత్రంలో మావోయిస్టులు పేర్కొన్నారు(naxal attack today). మరణించిన నలుగురిని సర్జు సింగ్ ఇద్దరు​ కుమారులు సాతిందర్ సింగ్ భోక్తా, మహేంద్ర సింగ్ భోక్తా, వారి భార్యలుగా గుర్తించారు.

నక్సలైట్లు శనివారం రాత్రి గ్రామానికి చేరుకుని ఆదివారం తెల్లవారుజామున ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఎస్​ఎస్​పీ ఆదిత్య కుమార్​ వెల్లడించారు. ఇప్పుడు గ్రామమంతా తమ నియంత్రణలో ఉందని, సాయంత్రం వరకు పోలీసులు మావోయిస్టులపై విజయం సాధిస్తారని చెప్పారు. ఘటనను సమీక్షించిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.

ఇదీ చదవండి: మహారాష్ట్ర ఎన్​కౌంటర్​లో​ 26 మంది నక్సల్స్ మృతి

Last Updated : Nov 14, 2021, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.