ప్రముఖ మాజీ క్రికెటర్, భాజపా నేత గౌతమ్ గంభీర్‌కు వచ్చిన బెదిరింపు లేఖ(threat letter to gautam gambhir) వచ్చింది. దీనిపై దిల్లీ పోలీసులకు స్వయంగా ఫిర్యాదు చేశారు గంభీర్. ఐఎస్‌ఐఎస్ కశ్మీర్(isis kashmir) అనే ఉగ్రవాద సంస్థ తనను చంపుతానని బెదిరిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశంపై దర్యాప్తు ప్రారంభించిన దిల్లీ పోలీసులు.. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ నివాసం(gautam gambhir residence) వద్ద భద్రతను పెంచినట్లు దిల్లీ సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ వెల్లడించారు. తూర్పు దిల్లీ నుంచి లోక్‌సభ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు గంభీర్.
'పెద్దన్న'పై గుస్సా..
క్రికెటర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన గంభీర్.. జాతీయ భద్రత, కశ్మీర్ సహా.. ఇతర సమస్యలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను 'పెద్దన్న' అని సంబోధించడాన్ని గంభీర్ తీవ్రంగా తప్పుపట్టారు. అంతేగాక.. పాక్‌ను తీవ్రవాద దేశంగా అభివర్ణించారు.
ఇవీ చదవండి: