Gas Price Reduced Today : వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వేర్వేరు రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సామాన్యులకు ఈమేరకు శుభవార్త చెప్పింది. ఓనం, రక్షాబంధన్ పండుగల సందర్భంగా మంగళవారం కేంద్ర మంత్రివర్గం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. గృహ అవసరాల కోసం వంట గ్యాస్ కొనుగోలు చేసే ఉజ్వల పథకం లబ్ధిదారులతోపాటు అన్ని కేటగిరీల వినియోగదారులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని.. రాఖీ పండుగ సందర్భంగా దేశంలోని మహిళలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన కానుకగా అభివర్ణించింది.
Gas Cylinder Price Decrease Today : ఎల్పీజీ ధర తగ్గింపుపై కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. పేదల కోసం తీసుకొచ్చిన ఉజ్వల పథకం కింద ఒక్కో సిలిండర్‌పై ఇప్పటికే రూ.200 రాయితీ ఇస్తుండగా.. ఇకపై రూ.400 సబ్సిడీ అందుతుందని వివరించారు. మిగిలిన వినియోగదారులకు రూ.200 రాయితీ అందుతుందని చెప్పారు. ఉజ్వల పథకం కింద కొత్తగా 75 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ పథకం కింద ప్రస్తుతం 9.6కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. '75 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్లు.. కొత్త కుటుంబాలకు కూడా ఇస్తాం. ఆడపిల్లలకు పెళ్లై కొత్తగా కుటుంబాలుగా ఏర్పడి.. కొత్త రేషన్ కార్డులు పొందినవారికి ఈ పథకం ఉపయోగపడుతుంది.' అని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
-
VIDEO | "On the occasion of Onam and Rakshabandhan, PM Modi has decided that LPG price will be reduced by Rs 200 for all consumers," says Union Minister @ianuragthakur during Cabinet briefing. pic.twitter.com/t4qLmtsWQf
— Press Trust of India (@PTI_News) August 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | "On the occasion of Onam and Rakshabandhan, PM Modi has decided that LPG price will be reduced by Rs 200 for all consumers," says Union Minister @ianuragthakur during Cabinet briefing. pic.twitter.com/t4qLmtsWQf
— Press Trust of India (@PTI_News) August 29, 2023VIDEO | "On the occasion of Onam and Rakshabandhan, PM Modi has decided that LPG price will be reduced by Rs 200 for all consumers," says Union Minister @ianuragthakur during Cabinet briefing. pic.twitter.com/t4qLmtsWQf
— Press Trust of India (@PTI_News) August 29, 2023
మహిళల సంక్షేమం, అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం మరెన్నో చర్యలు చేపడుతోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. పక్కా ఇళ్లు, మరుగుదొడ్ల నిర్మాణం, కొవిడ్ సమయంలో అదనంగా ఆహార ధాన్యాలు ఇవ్వడం, ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సాయం చేయడం వంటివాటిని ప్రస్తావించారు.
Gas Price Drop Today : ప్రస్తుతం దిల్లీలో 14.2కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1,103గా ఉంది. కేంద్రం రాయితీ అందిస్తున్న నేపథ్యంలో బుధవారం నుంచి రూ.903 చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఉజ్వల యోజన లబ్ధిదారులు ఒక్కో సిలిండర్‌కు రూ.903 చెల్లిస్తుండగా.. ఇకపై ఆ మొత్తం రూ.703కు తగ్గనుంది.
వంట గ్యాస్‌ను అతి తక్కువ ధరకే అందిస్తామని తెలంగాణ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇప్పటికే హామీ ఇచ్చింది. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా హామీలకు కౌంటర్‌గా ఎల్పీజీ ధరను కేంద్రం తగ్గించిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
'ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు'
చంద్రయాన్-3ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ.. మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించినట్టు..అనురాగ్ ఠాకూర్ వివరించారు. విక్రమ్ ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేయడం సహా ప్రజ్ఞాన్ రోవర్‌ను జాబిల్లి ఉపరితలంపై దించడం ద్వారా.. ఇస్రో సాధించిన విజయం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత పురోగతిని మరోసారి ప్రపంచానికి చాటిందని మంత్రివర్గం కొనియాడింది.
మోదీ స్పందన..
మరోవైపు.. గ్యాస్ ధర తగ్గింపుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. దేశ ప్రజలను తన కుటుంబంగా మోదీ అభివర్ణిస్తూ 'రక్షాబంధన్ పండగ మా కుటుంబంలో సంతోషాన్ని నింపింది. గ్యాస్ ధరల తగ్గింపు నా కుటుంబంలోని సోదరీమణుల సౌలభ్యాన్ని పెంచుతుంది. సోదరసోదరీమణులందరూ ఆరోగ్యంగా ఉండాలి' అని ట్వీట్ చేశారు.
-
रक्षाबंधन का पर्व अपने परिवार में खुशियां बढ़ाने का दिन होता है। गैस की कीमतों में कटौती होने से मेरे परिवार की बहनों की सहूलियत बढ़ेगी और उनका जीवन और आसान होगा। मेरी हर बहन खुश रहे, स्वस्थ रहे, सुखी रहे, ईश्वर से यही कामना है। https://t.co/RwM1a1GIKd
— Narendra Modi (@narendramodi) August 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">रक्षाबंधन का पर्व अपने परिवार में खुशियां बढ़ाने का दिन होता है। गैस की कीमतों में कटौती होने से मेरे परिवार की बहनों की सहूलियत बढ़ेगी और उनका जीवन और आसान होगा। मेरी हर बहन खुश रहे, स्वस्थ रहे, सुखी रहे, ईश्वर से यही कामना है। https://t.co/RwM1a1GIKd
— Narendra Modi (@narendramodi) August 29, 2023रक्षाबंधन का पर्व अपने परिवार में खुशियां बढ़ाने का दिन होता है। गैस की कीमतों में कटौती होने से मेरे परिवार की बहनों की सहूलियत बढ़ेगी और उनका जीवन और आसान होगा। मेरी हर बहन खुश रहे, स्वस्थ रहे, सुखी रहे, ईश्वर से यही कामना है। https://t.co/RwM1a1GIKd
— Narendra Modi (@narendramodi) August 29, 2023