ETV Bharat / bharat

Obesity in children: 'కరోనా వేళ చిన్నారుల్లో పెరిగిన ఊబకాయం'

కరోనా ముందుతో పోలిస్తే ఆ తరవాత ఎక్కువగా పిల్లలు ఊబకాయం(Obesity in children) బారినపడ్డారు. ఈ మేరకు దిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి వైద్యుల అధ్యయనంలో తేలింది. ఎక్కువ సమయం పని చేయకుండా కూర్చోవడం, ఒత్తిడి, సరైన నిద్రావేళలు పాటించకపోవడం వల్ల పిల్లలు బరువు పెరిగారని ఆస్పత్రి వర్గాలు తెలిపారు.

Obesity in children
పిల్లల్లో ఊబకాయం
author img

By

Published : Nov 14, 2021, 12:00 PM IST

కరోనా కాలంలో పిల్లల్లో ఊబకాయం(Obesity in children) సమస్య పెరిగిపోయింది. దిల్లీలోని సర్​ గంగారామ్ ఆస్పత్రి(Sir ganga ram hospital) నిపుణులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అక్టోబరు 1 నుంచి 31 మధ్య ఆన్​లైన్​లో నిర్వహించిన ఈ సర్వే(Obesity in children) ఫలితాలను(Obesity in pandemic) ఆస్పత్రి వర్గాలు శనివారం విడుదల చేశాయి.

"60శాతం కంటే ఎక్కువ మంది తమ చిన్నారులు సాధారణ బరువు కంటే 10శాతం ఎక్కువ బరువు పెరిగారని తెలిపారు. ఇంట్లోనే ఎక్కువ సేపు కూర్చోవడం, సమయానికి ఆహారం దొరకడం కారణంగా కూడా పిల్లలు బరువు పెరగడానికి కారణమని చాలా మంది చెప్పారు. ఒత్తిడి, సరైన నిద్ర వేళలు లేకపోవడం వల్ల పిల్లలు బరువు పెరిగారని పేర్కొన్నారు."

-గంగా రామ్ ఆస్పత్రి వైద్యులు

1,309 మంది 15 ఏళ్ల సగటు వయసు పిల్లలపై తాము ఈ అధ్యయనం(Obesity in pandemic) నిర్వహించామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

"సర్వేలో పాల్గొన్నవారిలో 36.8శాతం మంది ఎక్కువ సమయం ఏ పని చేయకుండా కూర్చోవడం వల్ల బరువు పెరిగారు. 27.75శాతం మంది సరైన నిద్ర వేళలు పాటించకపోవడమే కారణం, 22.4శాతం మంది అతిగా తినడం వల్ల బరువు పెరిగారు" అని గంగారామ్ ఆస్పత్రి అధికారి సుధీర్​ కల్హాన్ తెలిపారు. ప్రస్తుతం అనేక మంది పిల్లలు శారీరక, మానసిక, జీవన శైలి సమస్యలు ఎదుర్కొంటున్నారని వైద్యులు తెలిపారు. వీటిని ఎదుర్కోవడానికి తక్షణమే తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: బరువెక్కుతున్న బాల్యం-చిన్నారుల్లో పెరుగుతున్న ఊబకాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.