ETV Bharat / bharat

Gali Janardhan Reddy Assets: గాలి జనార్ధన్​ రెడ్డి ఆస్తులు జప్తు.. సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశం - కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధ్యక్షుడు గాలి

Gali Janardhan Reddy Assets: మాజీ మంత్రి, కర్నాటక ప్రస్తుత ఎమ్మెల్యే గాలి జనార్ధన్​ రెడ్డి ఆస్తులను సీజ్​ చేయాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జనార్దనరెడ్డి దంపతులకు చెందిన మొత్తం 124 ఆస్తులను జప్తు చేయాలని కోరుతూ గతంలో సీబీఐ అధికారులు ప్రత్యేక కోర్టులో పిటిషన్​ వేశారు. ఆ పిటిషన్​పై విచారణ జరిపిన కోర్టు.. ప్రస్తుతం జనార్ధన్​ రెడ్డి దంపతులకు చెందిన మొత్తం 77 ఆస్తులను అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ చట్ట సవరణ కింద జప్తు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Gali Janardhan Reddy Assets
Gali Janardhan Reddy Assets
author img

By

Published : Jun 13, 2023, 3:31 PM IST

CBI Special Orders on Gali Janardhan Reddy Assets: క్రిమినల్ కేసు పరిష్కారమయ్యే వరకు కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధ్యక్షుడు గాలి జనార్దనరెడ్డి, ఆయన భార్య లక్ష్మీ అరుణారెడ్డికి చెందిన ఆస్తులను జప్తు చేయాలని సీబీఐ అధికారులను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రత్యేక కోర్టు ఆదేశించింది. క్రిమినల్ కేసు పూర్తయ్యే వరకు జనార్దనరెడ్డికి చెందిన మొత్తం 77 ఆస్తులను స్తంభింపజేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

జనార్దనరెడ్డి దంపతులకు చెందిన మొత్తం 124 ఆస్తులను జప్తు చేయాలని కోరుతూ గతంలో సీబీఐ అధికారులు ప్రత్యేక కోర్టులో పిటిషన్​ వేశారు. ఆ పిటిషన్​పై విచారణ జరిపిన కోర్టు.. ప్రస్తుతం జనార్ధన్​ రెడ్డి దంపతులకు చెందిన మొత్తం 77 ఆస్తులను అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ చట్ట సవరణ కింద జప్తు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

గత ఏడాది ఆగస్టులో జనార్దనరెడ్డి ఆస్తులను జప్తు చేసేందుకు సీబీఐ అనుమతి కోరింది. జనార్దన్ రెడ్డి ఆస్తులను జప్తు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కొరడా ఝుళిపించడంతో మేల్కొన్న బసవరాజ బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వం.. ఈ ఏడాది జనవరి 12న జనార్దనరెడ్డి ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతి ఇచ్చింది.

రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు గాలి జనార్దనరెడ్డి అక్రమ ఖనిజం విక్రయం కేసులో క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. అక్రమ మైనింగ్ ఖనిజం విక్రయం కేసును విచారించిన కోర్టు.. గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణల చట్టం 1957, సెక్షన్లు 21, 23తో పాటు 4(1), 4(1A) కింద జనార్దనరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగేంద్రతోపాటు 16 మందిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. 2008, 2011లో ఇనుప ఖనిజం విక్రయం విషయంలో రాష్ట్ర ఖజానాకు 211 కోట్లు చెల్లించారు. నష్టం వాటిల్లిందని ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ, సెస్ చెల్లించకుండా ఉండేందుకు నిందితులు వ్యూహం రచించినట్లు తెలిసింది. ఈ కేసులో జనార్దనరెడ్డి మొదటి నిందితుడు.

2009లో గాలి అరెస్టు: గాలి జనార్దన్‌రెడ్డిపై గనుల అక్రమ తవ్వకాల కుంభకోణంలో ఆయనతో పాటు 9 మందిపై 2009లో సీబీఐ కేసులు నమోదు చేసింది. 2011వ సంవత్సరం సెప్టెంబరులో జనార్దన్‌రెడ్డిని అరెస్టు చేసి జైల్లో వేశారు. నాలుగేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన గాలికి.. 2015 జనవరి 20న సుప్రీంకోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది. కోర్టు ఆదేశాలను పాటిస్తున్నందున బెయిలు షరతులను సడలించాలంటూ 2020లో గాలి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పుడు విచారించిన న్యాయస్థానం.. ఆయా జిల్లాల ఎస్పీలకు తెలియజేసి కడప, బళ్లారి, అనంతపురం వెళ్లవచ్చంటూ ఆదేశాలిచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.