G 20 Meeting in India 2023 : జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశాలు దిల్లీ వేదికగా ఈనెల 9, 10 తేదీల్లో రెండురోజులపాటు జరగనున్నాయి. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దిల్లీలోని ప్రగతి మైదానంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. జీ-20 దేశాల కూటమి ప్రభుత్వాల కలయికతో ఏర్పడిన వేదిక. జీ-20లో మొత్తం 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ కలిపి మొత్తం 20 దేశాల ప్రభుత్వాలు ప్రతినిధులుగా ఉన్నాయి.
-
#WATCH | G 20 in India: Latest visuals from Bharat Mandapam in Delhi's Pragati Maidan. pic.twitter.com/NH4iy5URCE
— ANI (@ANI) September 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | G 20 in India: Latest visuals from Bharat Mandapam in Delhi's Pragati Maidan. pic.twitter.com/NH4iy5URCE
— ANI (@ANI) September 9, 2023#WATCH | G 20 in India: Latest visuals from Bharat Mandapam in Delhi's Pragati Maidan. pic.twitter.com/NH4iy5URCE
— ANI (@ANI) September 9, 2023
అంతర్జాతీయ ఆర్థికస్థిరత్వం, వాతావరణ మార్పుల తీవ్రత తగ్గింపు, సుస్థిరాభివృద్ధి వంటి అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థకు సంబంధించిన ప్రధాన సవాళ్లను అధిగమించేందుకు ఈ కూటమి పనిచేస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అత్యధిక దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలతోపాటు వర్ధమాన దేశాలు జీ-20 కూటమిలో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ దేశాల భాగస్వామ్యం ప్రపంచ స్థూల ఉత్పాదకతలో 80శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింటి రెండో వంతు, ప్రపంచ విస్తీర్ణంలో 60శాతంగా ఉన్నాయి.
-
#WATCH | G 20 in India: In the wake of G 20, buildings in the national capital decked up with decorative lights.
— ANI (@ANI) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Visuals from ITO) pic.twitter.com/5cgMph7wNJ
">#WATCH | G 20 in India: In the wake of G 20, buildings in the national capital decked up with decorative lights.
— ANI (@ANI) September 8, 2023
(Visuals from ITO) pic.twitter.com/5cgMph7wNJ#WATCH | G 20 in India: In the wake of G 20, buildings in the national capital decked up with decorative lights.
— ANI (@ANI) September 8, 2023
(Visuals from ITO) pic.twitter.com/5cgMph7wNJ
About G20 Summit 2023 : ప్రపంచ ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో 1999లో జీ-20 దేశాల కూటమి ఏర్పాటైంది. అయితే 2008 నుంచి ఏడాదికోసారి సమావేశం కావటం ప్రారంభమైంది. సభ్య దేశాల తరఫున ప్రభుత్వ అధినేత లేదా ఆర్థికమంత్రి లేదా విదేశాంగశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశాలకు హాజరవుతారు. ఇతర దేశాలు, అంతర్జాతీయ ఆర్గనైజేషన్లు, నాన్-గవర్నమెంటల్ సంస్థలను కూడా జీ-20 సదస్సులకు హాజరు కావాలని ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంటారు. కొన్నింటికి శాశ్వత ఆహ్వానం ఉంటుంది.
-
#WATCH | G 20 in India: Police continue its security checks in the wake of the G20 Summit
— ANI (@ANI) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Visuals from Delhi-Noida Border) pic.twitter.com/iMHzaJ8ihI
">#WATCH | G 20 in India: Police continue its security checks in the wake of the G20 Summit
— ANI (@ANI) September 8, 2023
(Visuals from Delhi-Noida Border) pic.twitter.com/iMHzaJ8ihI#WATCH | G 20 in India: Police continue its security checks in the wake of the G20 Summit
— ANI (@ANI) September 8, 2023
(Visuals from Delhi-Noida Border) pic.twitter.com/iMHzaJ8ihI
ఈ ఏడాది రోటేషన్ పద్ధతిలో జీ-20 సదస్సుకు దిల్లీ వేదిక అయింది. గతేడాది 2022లో ఇండోనేషియాలో ఈ సమావేశాలు జరిగాయి. దిల్లీ వేదికగా జరగనున్న ఈ సదస్సు స్థిరమైన అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించనుంది. అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల మధ్య ఆర్థిక ప్రగతిని విస్తృతం చేసేందుకు అవసరమైన చర్యలపై జీ-20 దేశాల అధినేతలు చర్చించనున్నారు. ఈ సమావేశాల చివరిరోజు భారత్ జీ-20 అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్‌కు అప్పగించనుంది.
భారీ సైకత శిల్పం..
Sudarsan Pattnaik G20 : జీ20 సమావేశాల నేపథ్యంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. ఒడిశాలోని పూరీ బీచ్‌లో భారీ జీ20 లోగోను ఇసుకతో రూపొందించి అతిధులకు ఆహ్వానం పలికారు. 150 అడుగులు పొడువు, 50 అడుగుల వెడల్పుతో దీన్ని తయారు చేశారు.
-
#WATCH | Odisha: Sand artist Sudarshan Patnaik created the G 20 logo at Puri Beach in the wake of the G 20 summit. (08.09) pic.twitter.com/wrz6EPoulW
— ANI (@ANI) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Odisha: Sand artist Sudarshan Patnaik created the G 20 logo at Puri Beach in the wake of the G 20 summit. (08.09) pic.twitter.com/wrz6EPoulW
— ANI (@ANI) September 8, 2023#WATCH | Odisha: Sand artist Sudarshan Patnaik created the G 20 logo at Puri Beach in the wake of the G 20 summit. (08.09) pic.twitter.com/wrz6EPoulW
— ANI (@ANI) September 8, 2023