ETV Bharat / bharat

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. శరీరమంతా తీవ్ర గాయాలు.. చిన్నారి పరిస్థితి విషమం - సూరత్​లో నాలుగేళ్ల బాలిక రేప్​

నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాడు ఓ వ్యక్తి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఈ అమానవీయ ఘటన గూజరాత్​లోని సూరత్​లో జరిగింది.

Four year girl child raped in Surat
Four year girl child raped in Surat
author img

By

Published : Jun 23, 2023, 1:34 PM IST

గుజరాత్​లోని సూరత్​లో నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. మర్మాంగాలు, ముఖం, కంటిపై తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో సీసీటీవీ ఫుటేజి అధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి.. తన భార్య, ఇద్దరు కుమార్తెలతో ఉపాధి కోసం సూరత్​కు వలస వచ్చాడు. వీరంతా గత కొన్నేళ్లుగా సూరత్​లోనే నివసిస్తున్నారు. గురువారం సూరత్​లోని ఓ నిర్మాణ స్థలంలో బాలిక తన తల్లిదండ్రులతో రాత్రి 9 గంటలకు నిద్రపోయింది. ఆ సమయంలో ఓ వ్యక్తి.. చిన్నారి నిద్రిస్తున్న సమయంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాదాపు రాత్రి రెండు గంటల సమయంలో చిన్నారి ఏడుస్తూ కనిపించింది. ఆమె తీవ్రంగా గాయపడి రక్తస్రావం అయింది. కంటిపై, ముఖంపై గాయాలు చూసి షాక్​ గురైన తల్లిదండ్రులు చిన్నారిని ఆరా తీయగా.. సమాధానం చెప్పే పరిస్థితిలో బాలిక లేదు.

ప్రాణాపాయస్థితిలో ఉన్న బాధితురాలిని అంబులెన్సులో న్యూ సివిల్​ ఆస్పత్రికి తరలించారు. వెంటనే అత్యవసర వార్డుకు తరలించి రెండు గంటలపాటు శస్త్ర చికిత్స చేశారు. బాలిక ఇంకా స్పృహలోకి రాలేదు. ఐసీయూలో ఉన్న ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్​ డాక్టర్​ గణేశ్​ గోవేకర్​ తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ఆ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అనంతరం రంగంలోకి దిగి నిందితుడి కోసం ముమ్మరంగా గాలించారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఇచ్ఛాపుర్​ ఆర్​జేడీ పార్కు వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

మూడున్నరేళ్ల బాలికపై రేప్​.. ఆపై హత్య..
మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడున్నరేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి కిరాతకంగా చంపేశాడు. ఈ అమానుష ఘటన కర్మాటకలోని బెంగళూరులో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి తల్లి కావేరీనగర్​లోని ఓ దుకాణంలో పని చేసేది. అక్కడే ఆమెకు 26 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో అతడు కూడా ఆమె ఇంట్లోనే ఉండేవాడు. ఆమె పనికి వెళ్లినప్పుడు కుమార్తెను చూసుకునేవాడు. మద్యం మత్తులో ఉన్న అతడు.. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి చంపేశాడు. ఇంతలో ఇంటికి వచ్చిన మహిళ.. కుమార్తెను చూసి షాక్​కు గురైంది. దీనిపై అతడిని ప్రశ్నించగా.. ఆమెపై ఎదురుదాడికి దిగాడు. స్థానికులు సహాయంతో పోలీసులను ఆశ్రయించిన మహిళ.. నిందితుడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతడు నేరాన్ని అంగీకరించాడు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.