జమ్ముకశ్మీర్లో రాజౌరి జిల్లాలో భాజపా నేత జస్బీర్ సింగ్ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
జస్బీర్ కుటుంబ సభ్యులంతా కూర్చొని ఉండగా.. ఈ పేలుడు సంభవించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న భద్రత సిబ్బంది.. గ్రనేడ్ పేలినట్లు అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి: చిమ్నీ కూలి ఏడుగురు కార్మికులు మృతి!